తిరుమలలో అతి చేసిన మంచు లక్ష్మి

Posted April 12, 2017

manchu lakshmi fight with media in tirumala
టాలీవుడ్‌ స్టార్‌ మంచు మోహన్‌బాబు వారసురాలు మంచు లక్ష్మి తాజాగా భర్తతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. వీరితో పాటు టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా ఉంది. కాలినడక మార్గం ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శించుకుని వస్తున్న వారిని మీడియా కవర్‌ చేసేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో మంచు లక్ష్మి మీడియాపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియా వారిని ఉద్దేశించి మీద మీద పడతారేంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక  మీడియా పర్సన్‌తో సారీ చెప్పండి అంటూ అదిరించింది. అందుకు వెంటనే అతడు సారీ మేడమ్‌ అన్నాడు.

ఆ తర్వాత కూడా మీడియా వారు ఆమె ముందు కెమెరాలు పెట్టడంతో మేము దేవుడి దర్శనం కోసం వచ్చామండి, మీకోసం రాలేదు అంటూ దండం పెట్టింది. దండం పెడతామండి మమ్ముల వదిలేయండి అంటూ మంచు లక్ష్మి అసహనం వ్యక్తం చేసింది. కనీస మర్యాద లేకుండా మీద మీద పడుతున్నారు అంటూ ఆమె ఆక్షేపించింది. అయితే మంచు లక్ష్మి మెల్ల మెల్లగా నడవకుండా స్పీడ్‌గా నడవడం వల్లే మీడియా వారు తోపులాడుకున్నారు. ఆమెను ఎంత మెల్లగా నడవమని అడిగినా కూడా ఆమె మీడియాను పట్టించుకోకుండా తిట్టుకుంటూ వెళ్లి పోయింది. పక్కనే ఉన్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మాత్రం మౌనంగా మంచు లక్ష్మి వెంట నడిచుకుంటూ వెళ్లి కారు ఎక్కింది. మంచు లక్ష్మి తీరుపై మీడియా మిత్రులు తీవ్ర ఆగ్రహంను వ్యక్తం చేస్తున్నారు.

SHARE