“మేడ మీద అబ్బాయి” గా మంచు విష్ణు

Posted February 2, 2017

manchu vishnu as meda mida abbayలక్కున్నోడు చిత్రంతో ప్రేక్షకులను డిజపాయింట్ చేసిన మంచు విష్ణు ఈ సారి వరుస సినిమాలతో అలరించేందుకు పెద్ద ప్లానే వేశాడట. త్వరలో మేడమీద అబ్బాయి అనే నవల ఆధారంగా ఓ సినిమాను చేయనున్నాడట.

రాజ్ తరుణ్ తో సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు చిత్రాన్ని తెరకెక్కించిన గవిరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాను చేయనున్నాడట  విష్ణు. అయితే వరుసగా రెండు సినిమాలతో బిజిగా ఉన్న విష్ణు ఈ మేడమీద అబ్బాయిని వచ్చే సంవత్సరానికి పోస్ట్  పోన్ చేశాడట.  వచ్చే జనవరి పండగలకి సినిమాను స్టార్ట్ చేసి  వేసవి బరిలో నిలిపే ప్రయత్నాల్లో చిత్రయూనిట్ ఉన్నట్లు సమాచారం. అయితే  వరుస ప్లాప్స్ తో ఉన్న విష్ణుకు, ఈ ప్లాప్ డైరెక్టర్ ఏ మేర హిట్ ఇస్తాడో అని మంచు అభిమానులు భావిస్తున్నారు.

SHARE