“ఓటర్” గా మంచు విష్ణు

Posted March 20, 2017

manchu vishnu as voterలక్కున్నోడు  సినిమాతో బోల్తా పడ్డ మంచు విష్ణు ఇప్పుడు కాస్త వెరైటీ కధలను ఎంచుకుంటున్నాడని తెలుస్తోంది. ఆచారి అమెరికా యాత్ర అనే సినిమాను ప్రారంభించిన విష్ణు ఓటర్ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. తెలుగు త‌మిళ భాష‌ల్లో ఒకేసారి తెర‌కెక్కుతున్న ఈ సినిమా పొలిటికల్ ధ్రిల్లర్ నేపధ్యంలో సాగనుందని సమాచారం.

ఈ సినిమాలో విష్ణు ఓ ఎన్ఆర్ఐగా నటిస్తున్నాడట. ఎన్నికల సమయంలో అమెరికా నుండి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకుని తిరిగి అమెరికా వెళ్తాడట. అయితే ఎలక్షన్స్ లో గెలిచిన ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం,  ప్ర‌జా సంక్షేమం పేరిట ప‌ధ‌కాల‌న్నీ త‌న సొంత అవ‌స‌రాల కోసం వాడుకుంటుంటుండడంతో విష్ణు అమెరికా నుండి తిరిగి వస్తాడట. ఓటరు అనే సాకుతో  ఎమ్మెల్యే కొమ్ములు విరగొట్టి ఆ ప్రాంతంలోని వారి సమస్యలను తీర్చడమే ఓటర్ సినిమా స్టోరీ. ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేసే ప్లాన్ లో ఉంది చిత్రయూనిట్. మరి దసరాకి వచ్చే ఓటర్ ఎలాంటి హిట్ ని అందుకుంటాడో చూడాలి.   

SHARE