బీజేపీలోకి మందకృష్ణ?

Posted November 28, 2016, 11:25 am

manda-krishna-madiga-mఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ.. ఈ మధ్య బీజేపీతో చాలా క్లోజ్ గా ఉంటున్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారాయన. అంతేకాదు వర్గీకరణ విషయంలో బీజేపీ సానుకూలంగా ఉండడంతో .. వెంకయ్యకు పాదాభివందనం చేసి కృతజ్ఞతను చాటుకున్నారు మందకృష్ణ. ఇక మిగిలింది పార్లమెంటులో వర్గీకరణ పెట్టడం. అది జరుగుతుందా లేదా అన్నది పక్కన బెడితే… మందకృష్ణ విషయంలో బీజేపీ చాలా సానుకూలంగా ఉందట.

మందకృష్ణకు బీజేపీ అగ్రనేతల నుంచి ఆహ్వానం వచ్చిందట. జాతీయపార్టీలోకి వస్తే… మంచి ఫ్యూచర్ ఉంటుందని భరోసా ఇచ్చారట. దీంతో మందకృష్ణలోనూ బీజేపీ దిశగా ఆలోచన జరుగుతోందని సమాచారం. ఇప్పటికే ఆయన తన అనుచరులతో మంతనాలు జరిపారని తెలుస్తోంది. చేరికకూడా దాదాపు ఖాయమనేని ప్రచారం జరుగుతోంది. తేలాల్సింది ముహూర్తమేనట. త్వరలోనే ఈ చేరిక ఉంటుందని చెబుతున్నారు.