బాబుకి ఆర్కే షాక్ తగిలింది ..

0
685
mangalagiri mla rk shocked to chandrababu sadaavarthi satram lands

 Posted [relativedate]

mangalagiri mla rk shocked to chandrababu sadaavarthi satram lands
ఏపీ సీఎం చంద్రబాబుకి మరో షాక్ ఇచ్చాడు ఆర్కే.ఈయన జర్నలిస్ట్ కాదులెండి ..మంగళగిరి ఎమ్మెల్యే .ఓటుకునోటు కేసులో బాబుకి చెమటలు పట్టించిన ఈ యువ వైసీపీ ఎమ్మెల్యే ఇప్పుడు సదావర్తి సత్రం భూముల వ్యవహారంలోనూ టీడీపీ సర్కార్ కి తలనొప్పి తెచ్చాడు.సదావర్తి భూములు తక్కువ ధరకే పరాధీనం చేసారంటూ అయన హైకోర్ట్ ని ఆశ్రయించారు.దీనిపై హై కోర్ట్ సర్కార్ కి షాక్ ఇచ్చే ఉత్తర్వులు ఇచ్చింది.కొనుగోలుదారులకు సేల్ సర్టిఫికెట్ ఇవ్వొద్దని,భూమిని అప్పగించొద్దని కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.

అమరావతిలోని సదావర్తి సత్రానికి చెన్నైలో 83 ఎకరాల భూమి వుంది .దాన్ని మార్కెట్ రేట్ కన్నా తక్కువకి ప్రభుత్వం విక్రయించిందని ఆరోపణలున్నాయి. పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్,కాపు కార్పొరేషన్ చైర్మన్ రామాంజనేయులతోపాటు లోకేష్ ఇందులో అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే గతంలో ఈ కేసు కోర్టులో నిలబడలేదు.దానికి కారణం అప్పట్లో కేసు దాఖలు చేసిన వాళ్ళు బాబు మనుషులేనని ఆర్కే అంటున్నారు.వాళ్ళు కోర్టుకి సరైన వివరాలు ఇవ్వకపోవడం వల్లే అప్పట్లో కేసు నిలవలేదని …ఆ తప్పు తాము సరిదిద్దామని ఆర్కే చెప్తున్నారు.కోర్టు తీర్పు బాబుకి చెంప పెట్టని ఆర్కే అభివర్ణించారు.బాబు ప్రభుత్వం పై పోరాడుతున్న ఆర్కే కి గతంలో కొన్ని బెదిరింపులు కూడా వచ్చాయి.అయినా ముందుకు వెళ్లి ఆర్కే మరోసారి బాబుకి షాక్ ఇచ్చాడని వైసీపీ సంబరపడుతోంది .

Leave a Reply