టాలీవుడ్లో సరైన గుర్తింపు రాకపోవడంతో హీరో హర్షవర్ధన్ రాణే.. బాలీవుడ్‌ను ఆశ్రయించాడు. అక్కడే లక్ వెతుక్కుంటూ రెండు హిందీ సినిమాలు రిలీజ్ చేసేశాడు కూడా. సత్రా కో షాదీ హై.. సనమ్ తేరీ కసమ్.. చిత్రాలతో సంచలనం సృష్టిద్దాం అనుకున్నాడు హర్షవర్ధన్. కాని పూర్తిగా సక్సెస్ కాలేదు. అయితే తాజాగా దిగ్గజ దర్శకుడు మణిరత్నం తీసిన క్లాసిక్ మూవీ ఘర్షణ.. హిందీ రీమేక్‌లో నటించే అవకాశం ఇతగాడిని వరించింది.
బెజోయ్ నంబియార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ధనుష్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఒరిజినల్ లో కార్తీక్ పోషించిన పాత్రను ధనుష్.. ప్రభు రోల్‌ను హర్షవర్ధన్ రాణే చేస్తున్నారని టాక్. బాలీవుడ్లో గాడ్‌ఫాదర్ అండ లేకపోతే రాణించడం కష్టమని అంటుంటారు. హర్షవర్ధన్‌కు ఈ మధ్యనే జాన్ అబ్రహాంతో ఏర్పడిన పరిచయం వల్లే అతడికి అవకాశాలు వస్తున్నాయని చెప్పుకుంటున్నారు. ఈ చిత్రం కనుక హిట్టైతే బాలీవుడ్లో గుర్తింపుతో ఆఫర్లు వస్తాయని హర్షవర్ధన్ ఆశిస్తున్నాడు.ndi