చెలియా కు U సర్టిఫికేట్..

  Posted March 25, 2017Mani Ratnam karthi Cheliyaa Movie Censored Gets 'U' Certificate

కార్తీ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చెలియా. మణిరత్నం  మార్క్ టేకింగ్ తో విజువల్ ఫీస్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 7న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఏఆర్‌ రెహ్మాన్ సంగీత సారథ్యంలో విడుదలైన పాటలకు అభిమానుల్లో మంచి రెస్పాన్స్‌ కూడా వచ్చింది.

కాగా  తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ ని పొందింది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన  ఈ సినిమాలో కార్తీ సరసన అదితిరావు హైద‌రీ హీరోయిన్‌ గా నటించింది. యుగానికి ఒక్కడు, ఆవారా, నా పేరు శివ వంటి డబ్బింగ్ సినిమాలతో కార్తీ తెలుగులో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు. ఊపిరి అనే స్రైట్ తెలుగు సినిమా చేసి  ఆ అభిమానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. దీంతో కార్తీ నటించిన చెలియా  సినిమాను తెలుగులో బడా నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేయనున్నారు. అలానే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పలు  డబ్బింగ్ సినిమాలు తెలుగులో కూడా హిట్స్ గా నిలిచాయి. మరి చెలియాతో అటు కార్తీ, ఇటు మణిరత్నం ఎటువంటి హిట్ ని అందుకుంటారో చూడాలి.

SHARE