కన్నా ఇంటికెళ్లిన మంత్రి..బాబుకి టెన్షన్?

0
534

WhatsApp Image 2016-08-13 at 8.00.43 AM
కన్నా లక్ష్మీనారాయణ …పేరుకి బీజేపీ నేత..విపక్షం వైసీపీ,కాంగ్రెస్ కన్నా మిత్రపక్షం తెలుగుదేశాన్ని ఇరుకున పెట్టడానికి అనుక్షణం తపిస్తుంటారు ..అవకాశం దొరికిన ప్రతిసారి సీఎం చంద్రబాబుని తూర్పార పడతారు.అధిష్టానం దగ్గర బాబు పరపతిని తగ్గించడానికి గట్టి ప్రయత్నమే చేశారు.అలాంటి కన్నా ఇంటికి బాబు క్యాబినెట్ మంత్రి వెళ్లారు.ఈ ఇద్దరూ బీజేపీ బలోపేతం మీద చర్చించారంట.ఇంతకీ ఆ మంత్రి మరెవరో కాదు దేవాదాయ శాఖ చూస్తున్న మాణిక్యాలరావు ..మంత్రి వర్గంలో ఉన్నప్పటికీ ప్రత్యేక హోదా సహా వివిధ అంశాలపై బీజేపీ వాణిని బలంగా వినిపించారు మాణిక్యాలరావు.హోదా సెంటిమెంట్ బలంగా వున్నా దాన్ని వరకట్నంతో పోల్చే సాహసం చేశారు.

ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతలు సమావేశం కావడం సహజమే అయినా ..ఆ నేతల వ్యవహార శైలి తెలిసిన బాబు అండ్ కో టెన్షన్ పడటం కూడా సహజమే.ఈ సమావేశం కాస్త ఆసక్తి రేపినా అధిష్టానం నిర్ణయాలని ప్రభావితం చేసే శక్తి వీరికి లేకపోవచ్చు..అయినా రాజకీయాల్లో ఎవరెప్పుడు చక్రం తిప్పగలరో ఊహించలేమని ఎన్టీఆర్ని గద్దె దించిన బాబుకి ఇంకొకరు చెప్పాలా ?

Leave a Reply