భారీ ఛాన్స్ కొట్టేసిన మంజిమా

0
621

Posted [relativedate]

mjm1416తెలుగులో పూరి సినిమాలో ఎంట్రీ ఇచ్చే హీరోయిన్స్ కు ఎంత క్రేజ్ ఉందో అలానే తమిళ దర్శకుడు గౌతం మీనన్ ఎంట్రీ ఇప్పించే హీరోయిన్స్ కు అంత ఫాలోయింగ్ ఉంది. ఏమాయ చేసావేతో సమంతను తెలుగు తెరకు పరిచయం చేసింది గౌతం మీననే. అయితే ఈసారి మరో మలయాళ భామని పరిచయం చేస్తున్నాడు గౌతం మీనన్. చైతు నటిస్తున్న సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో హీరోయిన్ గా నటించింది మంజిమా మోహన్.

గౌతం మీనన్ హీరోయిన్ అనగానే అందరి కళ్లు అమ్మడి మీద పడ్డాయి. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న మంజిమా కనీసం తన మొదటి సినిమా రిలీజ్ అవ్వకుండానే వరుస అవకాశాలను దక్కించుకుంటుంది. రీసెంట్ గా ధనుష్ హీరోగా సౌందర్య డైరెక్ట్ చేస్తున్న సినిమాలో ఛాన్స్ కొట్టేసిందట మంజిమా. ఆల్రెడీ కాజల్ ఓ హీరోయిన్ గా చేస్తున్న ఆ సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసింది మంజిమా. మరి ఆ సినిమా కనుక హిట్ అయితే కోలీవుడ్ లో అమ్మడికి తిరుగుండదని చెప్పొచ్చు.

Leave a Reply