ఇదేమి మెలిక ..మంజునాధా ?

0
481

narayana2
కాపులకు బిసి హోదా డిమాండ్ సమస్యను తేల్చాల్సిన మంజునాథ కమిషన్ మరో మెలిక పెట్టింది. ఒక్క కాపుల విషయమే కాదు 1994 నుంచి పెండింగ్ లో వున్న మొత్తం 74 కులాల సమస్యపై దృష్టి సారిస్తామని మంజునాథ విజయవాడ లో చెప్పారు .ఇదే సమస్య పై ఆయన్ను కాపు ,బీసీ సంఘాలు విడివిడిగా కలిశాయి.కాపు నేతలు తమను బీసీల్లో చేర్చాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు .ఆ పని చేసి తమకు అన్యాయం చేయొద్దని బీసీ సంఘాలు ఆయనకి మొర పెట్టుకున్నాయి .ఇద్దరి వాదనలు విన్న ఆయన వచ్చే నెలలోపబ్లిక్ హియరింగ్ చేపట్టనున్నట్టు చెప్పారు .20 ఏళ్ల నుంచి పెండింగ్ లో వున్న 74 సమస్యల్ని పరిష్కరిస్తామని తెలిపారు .రాయలసీమ నుంచి ప్రజాభిప్రాయం తీసుకోవడం మొదలెడతామని మంజునాథ వివరించారు .ఈ వ్యాఖ్యలపై కాపు ఉద్యమ నేత ముద్రగడ ఎలా స్పందిస్తారో చూడాలి .ఒక్క సమస్య తేల్చడమే కష్టమైతే ఇన్ని అంశాలు ముందుకు తెస్తే ఏమవుతుందో చూడాలి .

Leave a Reply