మౌన ముని మన్మోహన్ మోడీ పై మరో అస్త్రం

Posted [relativedate]

manmohan onemore attempt on modiమౌన ముని మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రి మోడీ పై ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ పై మరో అస్త్రాన్ని సంధించారు..పార్లమెంటరీ కమిటీ సమావేశం లో పెద్దనోట్ల రద్దు విషయంలో చర్చించుకునేందుకు భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)కి తగినంత సమయం ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించారట ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్‌ పటేల్‌ అభిప్రాయాన్ని కూడా తెలుసుకోవాలని చెప్పారు.

ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం పై తగిన సలహాలు ఇవ్వడానికి ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ కి ప్రముఖ ఆర్థికవేత్తలు రాజీవ్‌కుమార్‌, మహేశ్‌ వ్యాస్‌, కేంద్ర గణాంకశాఖ మాజీ చీఫ్‌ ప్రోణబ్‌ సేన్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీకి చెందిన కవితారావు లు హాజరయ్యారు. ఐతే నోట్ల రద్దు నిర్ణయంపై పలువురు ఆర్థిక నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేశారట.రద్దు నిర్ణయం నవంబర్‌ 7న తీసుకోగా, నవంబర్‌ 8న దీనిపై ఆర్బీిఐ సమీక్షించింది అని కాబట్టి స్థాయీ సంఘం మొదట ప్రభుత్వం వాదన విని.. ఆ తర్వాత ఆర్బీఐ గవర్నర్‌ ఏమంటారో చూస్తే మంచిదనే అభిప్రాయాన్నిఅయన వ్యక్తం చేసారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here