మహామహావారుణీ యోగం..!!

0
348
man's prayer to god in trayodashi than your Sins solved

 Posted [relativedate]

man's prayer to god in trayodashi than your Sins solvedచైత్రా౽సితే వారుణ ఋక్షయుక్తా
త్రయోదశీ సూర్యసుతస్యవారే
యోగేశుభేసా మహతీమహత్యా
గంగాజలేర్క గ్రహకోటి తుల్యా
– త్రిస్థలీసేతు

సామాన్యంగా గాలి పీల్చటం, మాట్లాడడం, నడవడం, అన్నం తినడం, మంచినీళ్ళు త్రాగడం ఈ పనులన్నీ తప్పనిసరి కార్యక్రమాలు. అయితే ఈ పనుల్లో భాగంగా జీవహింస జరుగుతుూ ఉంటుంది, తెలియకుండానే ఎన్నెన్నో సూక్ష్మ జీవులు మరణిస్తూ ఉంటాయి. అదే రోజురోజుకి వ్యక్తిని పాపంలో ముంచుతుంది. అందుకే వృద్ధుడైన కొలది ఆనందానికి దూరమై చింతాయుక్తుడౌతున్నాడు, “వృద్ధ స్తావత్‌ చింతాసక్తః”. కాబట్టి తక్కువ సమయంలో అధికంగా పుణ్యాన్ని సంపాదించుకునే అవకాశాలను పంచాగం సూచిస్తోంది. ఫాల్గుణ బహుళ త్రయోదశి దక్షిణాదిలోనూ, చైత్ర బహుళ త్రయోదశి (పూర్ణిమాంత పక్షము వాడే) ఉత్తరాదిలోనూ ఈ యోగం సంభవించే అవకాశం వుంది. ఫాల్గుణ బహుళ త్రయోదశి శనివారం, శతభిషం, శుభయోగం ఈ నాలుగూ కలిస్తే “మహామహావారుణీ యోగం”. ఈ సమయంలో చేసే స్నాన, దాన, జపాది శుభకార్యక్రమములు కోటి గుణితమైన సూర్యగ్రహణాలలో చేసిన సత్ఫలితాలను ఇస్తాయి. మార్చి 25 వ తారీకు మధ్యాహ్నం 1.28 నుంచి సాయంకాలం 4.51 వరకూ శనివారమూ త్రయోదశి కలిసినందు వలన వారుణీయోగంగాను, 4.51 నుంచి రాత్రి 2.27 వరకూ త్రయోదశి, శనివారము శతభిషా నక్షత్రము కలిసినందువలన మహావారుణీయోగంగాను, రాత్రి 2.27 నుండి ఆదివారం ఉదయం సూర్యోదయం వరకు శుభయోగం కూడా జతకావడంతో ‘మహామహావారుణీయోగం’ గాను ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం 12.24 నిమిషాల వరకు త్రయోదశి శతభిషం అనే రెండిటి సంయోగంతో ‘వారుణీయోగం’గాను సిద్ధిస్తోంది. ఈ సమయాన్ని జపము, దానము ఇత్యాది పుణ్యకార్యక్రమాలకు వినియోగించడం వల్ల కోటిగుణితమైన సత్ఫలితాలు కలుగుతాయి. ఈ దివ్య`మైన, పుణ్యవర్థకమైన, మహత్తరమైన సమయాన్ని సద్వినియోగం చేసుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం.

Leave a Reply