బీజేపీ లెక్కల్లో క్లారిటీ లేదా..?

0
340
Many say that Venkiah has done Amit Shah's pitch in his covering.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Many say that Venkiah has done Amit Shah's pitch in his covering.

తెలంగాణలో మూడు రోజుల పర్యటనకు వచ్చి రాజకీయ రచ్చ రేపిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా టీఆరెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యారు. కేంద్రం ఇంతవరకు తెలంగాణకు లక్ష కోట్లకు పైగా ఇచ్చిందని అమిత్ షా చెప్తుండగా అంతసీను లేదని కేసీఆర్ వెంటనే ఖండించేశారు. ఆయనతో పాటు ఇతర టీఆరెస్ నేతలూ అమిత్ షాను ఉతికి ఆరేస్తున్నారు. దీంతో ఇది కాస్త రచ్చరచ్చగా మారడంతో ఇప్పుడు ఏపీ బీజేపీ నేత కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు రంగంలోకి దిగి… అమిత్ షా మాటలు కేసీఆర్ కు అర్థం కాలేదని.. అమిత్ షా లెక్క అయిదేళ్ల కాలానికి కేంద్రం ఇస్తానన్నదని చెప్పుకొస్తున్నారు.

వచ్చే ఐదు సంవత్సరాల వ్యవధిలో తెలంగాణకు ఇస్తామని అమిత్ షా చెప్పిన నిధుల లెక్కలను కేసీఆర్ తప్పుగా అర్థం చేసుకున్నారని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. మూడు రోజుల పర్యటనకు వచ్చిన అమిత్ షా ను తప్పుబడుతూ కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. అయితే… అమిత్ షా మాటలు కేసీఆర్ కు అర్థం కాలేదే అనుకుందాం… మరి ఆయన మాటలను యథాతథంగా కోట్ చేస్తూ తెలంగాణ బీజేపీ పెద్దలు లక్ష్మణ్ కిషన్ రెడ్డి వంటివారంతా కేసీఆర్ టీఆరెస్ పై విరుచుకుపడ్డారు.
మరి వారికి కూడా అమిత్ షా మాటలు అర్థం కాకపోతే ఇక అమిత్ షా మాటలు అర్థం చేసుకుని తెలుగు రాష్ర్టాల్లో పార్టీని ఎక్కడికో ఎలా తీసుకుపోవాలనుకుంటున్నారో వెంకయ్యే చెప్పాలి. మొత్తానికి వెంకయ్య తన కవరింగ్ తో అమిత్ షాను పిచ్చోడ్ని చేశారని పలువురు అంటున్నారు.

Leave a Reply