ఆ దేశానికి యువరాజులు ఎక్కువేమరి..

  Posted November 3, 2016
many soudi kings and their cruel punishmentsసౌదీ అరేబియా పేరు చెబితేనే కఠిన శిక్షలకు పెట్టింది పేరు.. దొంగతనానికి కూడా మరణ శిక్ష విధించిన సందర్హాలున్నాయి.. చట్టాలు ఎంత గట్టిగా ఉన్న పాలకుల పాలిట చుట్టాలే మన దేశంలోలా అని అనుకుంటున్నారేమో.. అక్కడ ఆ అవకాశమే లేదు.. ఓ వ్యక్తిని కాల్చి చంపాడనే కారణంతో అక్కడ యువరాజుకు ఏకంగా మరణశిక్ష విధించారు.. ఆ సంఘటన మరువకముందే మరో యువరాజుకు కొరడా దెబ్బలతోపాటుజైలుశిక్ష విధించిన సంఘటన వెలుగుచూసింది. కొరడాతో కొట్టి మరీ జైల్లో పెట్టడానికి ప్రధాన కారణమేంటి.. ఆ యువరాజు ఎవరూ.. అనే అంశాలు బయటకు రాలేదు.. సౌదీ యువరాజు ఒకరికి కొరడా దెబ్బలతో పాటు జైలుశిక్ష విధించినట్లు స్థానిక వార్తా పత్రిక ఓకజ్‌ పేర్కొంది.
ఇటీవలే యువరాజు తుర్కీ బిన్‌ సౌద్‌ అల్‌ కబీర్‌కు మరణశిక్ష విధించిన కొన్ని రోజుల వ్యవధిలోనే మరో యువరాజుకు శిక్ష విధించడం చర్చనీయాంశంగా మారిందని ఓకజ్‌ తన కథనంలో పేర్కొంది. అల్‌ సౌద్‌ రాజవంశీకుల పాలనలో ఉన్న సౌదీ అరేబియాకు ప్రస్తుతం సల్మాన్‌ బిన్‌ అబ్దులాజీజ్‌ రాజుగా వ్యవహరిస్తున్నారు. పెద్ద కుటుంబం కావడంతో యువరాజుల సంఖ్య కూడా ఎక్కువే. ఈ క్రమంలో ఓ యువరాజు తప్పు చేయడంతో కొరడా దెబ్బలతో శిక్షించినట్లు సమాచారం. కొరడా దెబ్బలతో పాటు రెండు వారాల పాటు జైలుశిక్ష విధించినట్లు అంతర్గత మంత్రిత్వశాఖ తెలిపింది.
SHARE