Posted [relativedate]
- సీఎం చంద్రబాబు కదలికలపై మావోయిస్టుల కన్ను
- చంద్రబాబు దిల్లీ పర్యటన సమయంలో మావోయిస్టుల రెక్కీ
- ఏపీ భవన్ పరిసరాల్లో పలుమార్లు తచ్చాడిన మావోయిస్టులు
- దిల్లీ పోలీసుల నిఘాలో బయటపడిన వాస్తవాలు
- ఇప్పటివరకు ఆరుసార్లు రెక్కీ నిర్వహించినట్లు గుర్తించిన పోలీసులు
- మీడియా ముసుగులో దాడికి పాల్పడే అవకాశం ఉన్నట్లు గుర్తించిన దిల్లీ ఇంటెలిజెన్స్
- ఏపీ భవన్‌లో భద్రతా లోపాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన దిల్లీ పోలీసులు
- భద్రతా లోపాలపై ఏపీ భవన్ అధికారులను హెచ్చరించినా పట్టించుకోలేదంటున్న పోలీసులు
- ఇవాళ చివరిసారిగా హెచ్చరిస్తున్నామని ఏపీ భవన్ అధికారులకు తెగేసి చెప్పిన దిల్లీ పోలీసులుఢిల్లీ ఏపీ భవన్‌లో మావోయిస్టుల రెక్కీపై సమాచారం లేదని డీజీపీ సాంబశివరావు అన్నారు. మీడియాతో సాంబశివరావు మాట్లాడుతూ.. సీఎం భద్రతకు సంబంధించి మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. గత హెచ్చరికలు దృష్టిలో పెట్టుకునే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.