బాబు,లోకేష్ మావో టార్గెట్ ఎందుకయ్యారు?

 Posted October 27, 2016

maoists threatening letter to chandrababu lokesh
మల్కన్ గిరి ఎన్ కౌంటర్ లో దాదాపు ముప్పై మంది మావోయిస్టు లు చనిపోయారు.ఇంత భారీ ఎన్ కౌంటర్ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు,అయన కుమారుడు లోకేష్ ని టార్గెట్ చేస్తూ మావోయిస్టు ల పేరుతో వచ్చిన లేఖపై కొన్ని అనుమానాలు వున్నాయి.ఆత్మాహుతి దాడి,కుటుంబాల్ని టార్గెట్ చేయడం వంటివి సహజంగా మావోయిస్టు పరిభాష కాకపోవడమే అందుకు కారణం.అయితే ఆ లేఖ విషయం ఎలా వున్నా బాబు,లోకేష్ లని మావోలు టార్గెట్ చేసుకున్న మాట నిజమేనని పోలీస్ వర్గాలు అనధికారిక సంభాషణల్లో అంగీకరిస్తున్నారు.

విశాఖ మన్యం లో బాక్సయిట్ నిక్షేపాల కోసమే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి పట్టుదలతో వ్యవహరించి ఎన్ కౌంటర్ కి ప్లాన్ చేసినట్టు మావోలు భావిస్తున్నారు. బాక్సయిట్ తవ్వకాల కోసమే ఈ పని చేశారని ఆరోపిస్తున్నారు.ఆ వ్యూహాన్ని తిప్పికొట్టడానికే బాబు,లోకేష్ టార్గెట్ విషయాన్ని మావోలు ప్రచారం చేస్తున్నట్టు పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి.ఏదేమైనా ..ఎలాంటి పరిస్థితి ఎదుర్కోడానికైనా సిద్ధంగా వుంది పోలీస్ శాఖ.

SHARE