జగన్ కు మాస్టర్ స్ట్రోక్ తప్పదా..?

 Posted April 13, 2017master stroke to jagan by hi sparty leaders

వలసలు, ఫిరాయింపులుంటూ చంద్రబాబుపై అక్కసు వెళ్లగక్కుతున్న జగన్.. సొంతింటిని చక్కదిద్దుకోవడంలో మాత్రం ఘోరంగా విఫలమౌతున్నారు. అధికారం సంగతి పక్కనపెడితే కనీసం నాయకుడిగా తగిన వ్యవహారశైలి కూడా చూపలేకపోతున్నారు. ప్రతిపక్ష నేతగా అందరినీ కలుపుకుపోవాల్సిన జగన్.. ఏకపక్ష నిర్ణయాలతో ఎమ్మెల్యేల్ని విసిగిస్తున్నారు. అటు అసెంబ్లీలో. ఇటు ప్రెస్ మీట్లలో ఎక్కడ చూసినా జగనే కనిపిస్తున్నారు. ఏ అంశంపై అయినా ఆయనే లీడ్ తీసుకోవడం, ఎమ్మెల్యేల్ని ఉత్సవ విగ్రహాలుగా మార్చడం చాలా మందికి రుచించడం లేదు.

అందుకే టీడీపీలోకి వెళ్లడానికి మరో పది మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలు పసుపు తీర్థం పుచ్చుకున్నారు. మరో పది మంది కూడా గోడ దూకితే.. జగన్ కు నైతికంగా పెద్ద దెబ్బ తగులుతుంది. ఇప్పటికే ఫిరాయింపులకు జగన్ కారణమని టీడీపీ ఆరోపిస్తోంది. చేరికలు ఇంకా కొనసాగితే.. ఆ ఆరోపణ నిజమౌతుంది. జగన్ కు ఇబ్బంది ఏర్పడుతుంది. నిజానికి 30 మందికి పైగా ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తామన్న చంద్రబాబే వ్యూహాత్మకంగా 21కి పరిమితం చేశారని కూడా వాదన ఉంది.

ఇప్పుడు జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టుని కోరడంతో మళ్లీ ఎమ్మెల్యేల్లో కలవరం మొదలైంది. జగన్ జైలుకెళితే పరిస్థితి ఏంటని కంగారుపడుతున్నారు. ఇప్పటిదాకా స్లోగా జరిగిన జగన్ కేసుల విచారణ.. ఎన్నికల నాటికి వేగం పుంజుకుంటుందని భావిస్తున్నారు. అప్పుడు అటూ ఇటూ అయితే తాము అన్యాయమైపోతామని ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. అందుకే ముందుజాగ్రత్తగా టీడీపీలో బెర్తులు రిజర్వ్ చేస్కుంటున్నారు. ఎలాగో నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది కాబట్టి తమకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.

SHARE