దేవుడికే స్పాట్ పెట్టిన మావోయిస్టులు!!

0
500
mavoyists spot to lord ganesh

Posted [relativedate]

mavoyists spot to lord ganesh
ఛ‌త్తీస్ గ‌ఢ్ లో మావోయిస్టులు మ‌రీ బ‌రి తెగించారు. మ‌నుషుల‌నే కాదు దేవుళ్లనూ వ‌ద‌లడం లేదు. ప‌రిస్థితి ఎంత వ‌ర‌కు వెళ్లిందంటే అడ్డొస్తున్నార‌న్న సాకుతూ దేవుళ్ల‌కూ స్పాట్ పెట్టేస్తున్నారు. దంతేవాడ జిల్లాలో జ‌రిగిన ఘ‌ట‌న ఇప్పుడు మావోయిస్టుల బ‌రితెగింపున‌కు అద్దం ప‌డుతోంది.

దంతేవాడ జిల్లా ప‌చ్చ‌ద‌నానికి మారుపేరు. ద‌ట్ట‌మైన అట‌వీప్రాంతంతో ప్ర‌కృతి ప్రేమికుల‌ను ఆక‌ట్టుకునే ధోల్క‌ల్ పర్వ‌త‌ప్రాంతంలో ఓ భారీ గణేశుడి పురాత‌న విగ్ర‌హం ఉంది. భూమి నుంచి 13 వేల అడుగుల ఎత్తులో కొలువైన ఈ విగ్ర‌హానికి వెయ్యేళ్ల చ‌రిత్ర ఉంది. ప్ర‌కృతి మాత‌ ఒడిలో కొలువైన ఈ భారీ పార్వ‌తీ త‌న‌యుడి రూపాన్ని ఒక్క‌సారి చూస్తే మ‌న‌సు నుంచి చెరిగేపోయే అవ‌కాశమే లేదు. అంత ముగ్ధ మ‌నోహ‌రంగా ఉంటుంది. విగ్ర‌హానికి వెయ్యేళ్ల చ‌రిత్ర ఉన్నా… వెలుగులోకి వ‌చ్చి రెండుమూడేళ్లే అయ్యింది. దీంతో ఈ మ‌ధ్య ధోల్క‌ర్ గ‌ణేశుడిని చూడ‌డానికి భ‌క్తుల సంఖ్య పెరిగింది.

ఈ భారీ గ‌ణ‌ప‌తికి వ‌చ్చిన ప‌బ్లిసిటీ చూసి మావోయిస్టుల‌కు గుండె గుబేల్ మ‌న్న‌ది. మావోయిస్టుల కేరాఫ్ అడ్ర‌స్ అయిన ఈ ప‌ర్వ‌త‌ప్రాంతంలో ప‌ర్యాట‌కుల సంఖ్య పెరుగుతుండ‌తో వారిలో ద‌డ పుట్టింది. ప‌ర్యాట‌కుల‌తో మావోయిస్టుల రోజువారీ కార్యక‌లాపాల‌కు ఇబ్బంది ఏర్ప‌డుతోంద‌ట‌. ముఖ్యంగా త‌ల దాచుకోవ‌డానికి కూడా స‌మస్య‌లు వ‌స్తున్నాయ‌ట‌. దీంతో మ‌హా గ‌ణ‌ప‌తికే స్పాట్ పెట్టేశారు మావోయిస్టులు.

అంత పెద్ద భారీ విగ్ర‌హాన్ని నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేశారు. భారీ గ‌ణ‌ప‌తిని 56 ముక్క‌లుగా చేసి… 1000 అడుగుల లోతులో ప‌డేశారు. దీంతో ఒక‌ప్పుడు ధోల్క‌ల్ లో ఠీవిగా ఉన్న మ‌హా వినాయ‌కుడు … ఇప్పుడు ఆన‌వాళ్లు కూడా లేకుండా ముక్క‌లైపోయాడు. ఈ వార్త విని భ‌క్తులు, ప‌ర్యాట‌కులు బాధ‌ప‌డుతున్నారు. అయ్యో… దేవుళ్ల‌నూ కూడా వ‌ద‌ల‌కుండా మావోయిస్టుల‌కు ఇంత బ‌రితెగింపు అవ‌సర‌మా ..? అని మండిప‌డుతున్నారు.

Leave a Reply