త్రివిక్రమ్ తో చైతూ.. ఇప్పట్లో కష్టమే

0
516
may-trivikram-directs-naga-chaitanya-movie

may-trivikram-directs-naga-chaitanya-movie

త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ మాటల మాంత్రికుడికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈయన  మాటలు అందించినా, దర్శకత్వం వహించినా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కుమ్మరించాల్సిందే.

దీంతో యంగ్ హీరోల నుండి పెద్ద హీరోల వరకు అందరూ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించాలని కాపు కాచుకుని కూర్చుంటున్నారు. త్రివిక్రమ్ ఊ.. అనగానే సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నారు. తాజాగా నాగచైతన్యతో త్రివిక్రమ్ సినిమా ఉండనుందని వార్తలు వచ్చాయి. ఈ సినిమా దసరా నుండి ప్రారంభం కానుందని, ఇందుకు నాగార్జున కూడా ప్రిపేర్డ్ గా ఉన్నాడని అంటున్నారు. నిజానికి ఈ కాంబినేషన్ లో సినిమా అంటే ఇప్పట్లో కష్టమంటున్నారు సినీ విశ్లేషకులు. ఎందుకంటే త్రివిక్రమ్ ఇప్పుడు చాలా బిజీ. ఫస్ట్ పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కనుంది.  తర్వాత ఎన్టీఆర్ సినిమా లైన్ లో వుంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తో ఓ మూవీ  ఫిక్స్ అయ్యింది. స్వయంగా మహేష్ బాబే  ఈ సినిమా గురించి ప్రస్తావించాడు. ఇక చెర్రీ  ఎప్పటినుండో లైన్ లో ఉన్న సంగతి తెలిసిందే. కుదిరితే బన్నీ కూడా ఓ సినిమా చేసేయాలి అనే ప్లాన్ చేస్తున్నాడు. ఇంత బిజీ షెడ్యుల్ మధ్య చైతుతో త్రివిక్రమ్  మూవీ అంటే ఎప్పటికి సెట్ అయ్యేను. కాబట్టి చైతూ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా ఇప్పట్లో కుదరదని చెప్పుకుంటున్నారు. అయితే నాగార్జున మాత్రం ఈ సినిమాను ఎలాగైనా దసరా నుండి ప్రారంభించాలని గట్టి ప్రయత్నాల్లో ఉన్నాడట. మరి త్రివిక్రమ్ ఏ హీరోకి ఓటేస్తాడో చూడాలి.

Leave a Reply