మోడీకి మయా సెగ ..కుంభకర్ణ ఆరోపణ ..

 mayavathi fair modi
దళితులు కేంద్రంగా హైదరాబాద్ వేదికగా ప్రధాని మోడీ చేసిన ప్రసంగం తాలూకా ప్రకంపనలు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి.గోరక్షణ పేరిట రెచ్చిపోతున్న శక్తులు ఉలిక్కిపడితే ..అదే స్థాయిలో దళితవర్గాల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి.ఇదంతా ఎన్నికల వ్యూహమేనన్న వాగ్భాణాలు దూసుకొస్తున్నాయి .

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇన్నాళ్లూ కుంభ‌క‌ర్ణుడిలా నిద్ర పోతున్నారా అని బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి నిలదీశారు .. ద‌ళితుల‌పై వరుసగా దాడులు జ‌రుగుతున్న అంశంపై ఇటీవ‌ల మోదీ స్పందించారు. అయితే చాలా ఆస‌ల్యంగా ఆయ‌న స్పందించార‌ని మాయావ‌తి ఆరోపించారు. గ‌త రెండు ఏళ్లుగా కుంభ‌క‌ర్ణుడిలా మోదీ నిద్ర పోతున్నార‌ని, ఇప్పుడు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నికలు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో, ద‌ళిత ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు బీఎస్సీ నేత విమ‌ర్శించారు. రాబోయే యూపీ ఎన్నిక‌ల్లో ఒక్క ద‌ళిత ఓటు కూడా రాద‌ని తెలిసే, మోదీ ఈ ప్ర‌య‌త్నాల‌కు దిగుతున్న‌రాని ఆమె అన్నారు.

SHARE