విభ‌జ‌న అస్త్రం ప్ర‌యోగించిన మాయా!!!

0
531
mayavathi plan for seperation became hit

Posted [relativedate]

mayavathi plan for seperation became hit
ఒక‌ప్పుడు యూపీలో అధికారంలో ఉన్న బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ ఇప్పుడు ఇబ్బందులు ప‌డుతోంది. ఈ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ పెద్ద‌గా పుంజుకునే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. ఏ ఎన్నిక‌ల స‌ర్వేలోనూ ఆ పార్టీకి స‌రైన ఫ‌లితాలు రాలేదు. అంతేకాదు నోట్ల ర‌ద్దు అంశం కూడా బీఎస్పీపై ప్ర‌భావం చూపింద‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీంతో మాయావ‌తి నిస్స‌హాయురాలిగా మిగిలిపోయారు. పార్టీ బాధ్య‌త‌ల‌న్నీ ఆమె ఒక్క‌రే మోయాల్సి వ‌స్తోంది. ప్రయోగించిన అస్త్రాల‌న్నీ పార‌క‌పోవ‌డంతో ఆమె చివ‌రి అస్త్రంగా రాష్ట్ర విభ‌జ‌న అంశాన్ని తెర‌పైకి తెచ్చారు.

రాష్ట్ర విభ‌జ‌న అంశంపై నాలుగుద‌శ‌ల పోలింగ్ జ‌రిగే వ‌ర‌కు మౌనంగా ఉన్నారు మాయావ‌తి. ఐదో ద‌శ‌, ఆరోద‌శ‌లో పూర్వాంచ‌ల్ లో ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. అభివృద్ధిలో పూర్వాంచ‌ల్ వెనుకంజ‌లో ఉంది. కాబ‌ట్టి పూర్వాంచ‌ల్ డిమాండ్ ను తెర‌పైకి తేవ‌డం ద్వారా సెంటిమెంట్ ను రాజేసే ప్ర‌య‌త్నం చేశారు. స‌రిగ్గా ఐదో ద‌శ ఎన్నిక‌ల‌కు ముందు రోజే ఈ ప్ర‌క‌ట‌న చేశారు మాయా.

పూర్వాంచ‌ల్ లో బీఎస్పీకి కొంత ఓటు బ్యాంకు ఉంది. ఆ ఓటు బ్యాంకుకు పూర్వాంచ‌ల్ సెంటిమెంట్ తోడైతే బీఎస్పీకి మంచి ఫ‌లితాలు వ‌స్తాయి. కాబ‌ట్టే ఈ విభ‌జ‌న అస్త్రాన్ని మాయా ప్ర‌యోగించార‌న్న వాద‌న వినిపిస్తోంది. అయితే ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో ఇత‌ర పార్టీలేవీ రాష్ట్ర విభ‌జ‌న అంశంపై నోరెత్త‌లేదు. తద్వారా బీఎస్పీకి మాత్ర‌మే ఆ అంశంపై చిత్త‌శుద్ధి ఉంద‌ని చాటిచెప్పే ప్ర‌య‌త్నం మాయావ‌తి చేస్తున్నారు.

అయితే గ‌త ఎన్నిక‌ల్లో రాష్ట్ర విభ‌జ‌న‌ను వ్య‌తిరేకించిన ఎస్పీకే జ‌నం ప‌ట్టం క‌ట్టారు. కాబ‌ట్టి ఈసారి రాష్ట్ర విభ‌జ‌న‌కు జై కొట్టిన బీఎస్పీకి జ‌నం ఓటేస్తారా అన్న‌ది అనుమానామే. అయితే అభివృద్ధిలో వెనుక‌బ‌డిన పూర్వాంచ‌ల్ లోనే ఆ అంశాన్ని తెర‌పైకి తేవ‌డం వ్యూహంలో భాగమే. మ‌రి ఈ వ్యూహంతో మాయావ‌తికి ఏ మేర ల‌బ్ధి జ‌ర‌గ‌నుందో… ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాతే తేల‌నుంది!!!

Leave a Reply