Posted [relativedate]
500 ,1000 నోట్లు రద్దయ్యాక వైసీపీ అధినేత జగన్ బయటికి రాలేదు.దీంతో ఎన్నో ఊహాగానాలు,మరెన్నో విమర్శలు….వాటికి సమాధానంలా ఈరోజు జగన్ రెండు కుటుంబాల్ని ఓదారుస్తున్న ఫోటోలు బయటికి వచ్చాయి.ఇటీవల ఓ ప్రొఫెసర్ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న సంధ్యారాణి కుటుంబ సభ్యుల్ని అయన ఓదార్చారు.అలాగే నెల్లూరు జిల్లాకి సంబంధించి ఓ ప్రమాదంలో చనిపోయిన సుబ్బా రెడ్డి కుటుంబ సభ్యుల్ని కూడా జగన్ పరామర్శించారు.అయన అవయవాలని కుటుంబ సభ్యులు దానం చేశారు.వారికి వైసీపీ nri విభాగం ప్రకటించిన రెండు లక్షల రూపాయలు అందచేశారు.
ఈ ఫోటోలు బయటికి రాకముందు టీడీపీ నేత వర్ల రామయ్య మరోసారి జగన్ మీద తీవ్ర విమర్శలు గుప్పించారు.మా వద్ద ఉన్న సమాచారం ప్రకారం జగన్ కట్టుకున్న భారీ భవంతుల నేలమాళిగల్లో పెద్ద ఎత్తున నల్ల ధనం ఉందని వర్ల ఆరోపించారు.సిబిఐ 43 వేల కోట్ల రూపాయలకి సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే …ఇంకో 43 వేల కోట్లు అదనంగా జగన్ వద్ద ఉన్నాయని వర్ల అంటున్నారు.మోడీ నిర్ణయం తర్వాత ఏమి చేయాలో తెలియక జగన్ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారని వర్ల ఎద్దేవా చేశారు.మొత్తానికి జగన్ నాలుగు రోజులు బయట కనపడకపోయినా టీడీపీ వూరుకునేట్టు లేదుగా !