Posted [relativedate]
ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. డిసెంబర్ 23న విడుదల చేసేందుకు నిర్మాత కె.కె.రాధామోహన్ సన్నాహాలు చేస్తున్నారు. పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో ఈ చిత్రం నిర్మించారు.
ప్రస్తుతం అందరూ ఎదుర్కొంటున్న కరెన్సీ సమస్యను దృష్టిలో వుంచుకొని డిసెంబర్ 23న ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలని నిర్ణయించాం. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ట్రైలర్స్ అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల విడుదలైన ఆడియో కూడా సూపర్‌హిట్ అయింది. తప్పకుండా మా బేనర్‌లో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ మరో సూపర్‌హిట్ సినిమా అవుతుంది అనే అంచనాలున్నాయి .