బన్నీ సినిమాపై మెగాబ్రదర్స్ మోజు..

0
158
mega brothers intrested on allu arjun naa peru surya naa illu india movie

Posted [relativedate]

mega brothers intrested on allu arjun naa peru surya naa illu india movieరేసుగుర్రం సినిమా తర్వాత బన్నీ నిజంగానే రేసుగుర్రంలా పరుగెడుతున్నాడు. వరుస సినిమాలు చేస్తూ హిట్  మీద హిట్ కొడుతున్నాడు. ప్రస్తుతం దువ్వాడజగన్నాధమ్ సినిమా చేస్తున్నాడు బన్నీ. ఈ సినిమా తర్వాత బన్నీ లగడపాటి శ్రీధర్ నిర్మాణ సారధ్యంలో రూపొందనున్న భారీ ప్రాజెక్ట్ సినిమాలో నటిస్తున్నాడు. రేసుగుర్రం సినిమాకు రైటర్ గా పనిచేసిన వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు.  ఈ చిత్రానికి ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ అనే టైటిల్ ని  అని పెట్టినట్లు సమాచారం.

ఇక అసలు విషయానికొస్తే బన్నీ  నటించబోయే  ఈ చిత్రానికి  మెగా బ్రదర్ నాగబాబు సహనిర్మాతగా  వ్యవహరిస్తున్నాడు.  సినిమాలో ఓ ప్రత్యేకమైన పాత్రను పోషించాలని మెగాస్టార్ చిరంజీవిని బన్నీ  రిక్వెస్ట్ చేశాడట. కధ  నచ్చడంతో పాటు తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉండడంతో మెగాస్టార్ కూడా ఓకే చెప్పాడట. మరి మెగా బ్రదర్స్ సపోర్ట్ తో బన్నీ ఏ రేంజ్ కి దూసుకుపోతాడో చూడాలి.

Leave a Reply