మెగా కాంపౌండ్ బోయపాటిని వదలట్లేదట

0
639
mega compound boyapati

mega compound boyapati

టాలెంటెడ్ డైరక్టర్స్ ను ఎప్పటికప్పుడు తమతో సినిమాలు తీయాలని ఉత్సాహం చూపిస్తారు స్టార్ హీరో కుటుంబాలు. ఇక మొన్నటిదాకా నందమూరి నట సింహం బాలయ్యకు రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన బోయపాటి సరైనోడు హిట్ తో మెగా కాంపౌండ్ లోకి ఎంటర్ అయ్యాడు. ఏదో ఒక సినిమా చేస్తాడు మళ్లీ వచ్చేస్తాడు అనుకుంటే ఇప్పుడు ఈ దర్శకుడితో వరుస బెట్టి మెగా హీరోల సినిమాలు తీసే ఆలోచనలో ఉన్నాడట అల్లు అరవింద్. ఇప్పటికే మెగాస్టార్ 151వ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయట. దాదాపు మెగాస్టార్ 151వ సినిమాకు బోయపాటి శ్రీనునే దర్శకుడు అని టాక్.

అంతేకాదు సరైనోడుతో అల్లు అర్జున్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందించిన బోయపాటిని మళ్లీ బన్నికి సూటయ్యే కథ ఉంటే చెప్పు చేసేద్దాం అని అంటున్నాడట. సినిమాను ఫ్యాన్స్ కు నచ్చే అంశాలతో స్టార్ ఇమేజ్ కు తగ్గట్టు సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ కొడుతున్న బోయపాటి శ్రీను ఇప్పుడు మెగా హీరోలతో జోడి కట్టడం మంచి పరిణామమే అని చెప్పొచ్చు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాను డైరెక్ట్ చేస్తున్న బోయపాటి త్వరలోనే చిరు సినిమా విషయంపై ఓ క్లారిటీకి రానున్నాడట.

Leave a Reply