సేఫ్ చూసుకుంటే దెబ్బ పడిందా?.మెగా ఫ్యామిలీ అంతర్మధనం..

Posted December 17, 2016

mega family shocked to after watching gautamiputra satakarni movie trailer
గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ చూసాక యావత్ సినీ ప్రపంచం జయహో అని నినదించింది. దీంతో సంక్రాంతికి శాతకర్ణితో పోటీపడుతున్న ఖైదీ నెంబర్ 150 టీం డిఫెన్స్ లో పడింది.మెగా ఫ్యామిలీ ఏకంగా అంతర్మధనం చెందుతోంది.మెగా స్టార్ చిరు 150 వ సినిమా ఏది చేయాలన్నదానిపై జరిగిన కసరత్తు ..తీసుకున్న సమయం అంతాఇంతా కాదు.చివరికి ఓ రీమేక్ సినిమాకి పచ్చ జెండా ఊపారు.దర్శకుడిగా వినాయక్ ని పెట్టుకున్నారు.అంతా అనుకున్నట్టే సినిమా సజావుగా సాగిపోయింది.కానీ మెగా స్టార్ చిరంజీవి 150 వ సినిమాకి రావాల్సినంత ఆసక్తి మాత్రం జనాల్లో రాలేదు.దానికి ప్రధాన కారణం ఆ సినిమా ఎలా ఉండబోతోందో చాలా మందికి తెలియడంతో పాటు …పూర్తిగా ఫార్ములా మూవీ కావడమే .ఇదే సేఫ్ అనుకుని మెగా ఫ్యామిలీ ఈ ప్రాజెక్ట్ టేక్ అప్ చేసింది.కానీ ఇటీవల కాలంలో ప్రయోగాత్మక సినిమాలకి జనం జేజేలు కొడుతున్న విషయాన్ని మెగా ఫ్యామిలీ పరిగణనలోకి తీసుకున్నట్టు లేదు.అందుకే మినిమం గారంటీ అనుకుంది …ఇప్పుడు మినిమం గ్యారంటీ మాత్రమే కనిపించడంతో తప్పు చేసామేమో అన్న ఆలోచనలో పడింది.ఏదైనా రిస్కీ ప్రాజెక్ట్ చేసి ఉండాల్సిందని ఫాన్స్ కూడా అనుకుంటన్నారు.ఫాన్స్ కూడా ఏదో మేజిక్ ఆశించారు.అయినా మెగా స్టార్ ఉండటమే పెద్ద మేజిక్ అని సర్దుకుపోయారు తప్ప పూర్తి స్థాయిలో సంతృప్తి చెంది మాత్రం కాదు.అయితే లోలోన ఎన్నున్నా బయటపడకుండా ఉండిపోయారు.

తాజాగా గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ రిలీజ్ అయ్యాక సీన్ మారిపోయింది.ఇంత చిన్న వ్యవధిలో ఇంత భారీ బడ్జెట్ సినిమా తీయడం ఆషామాషీ విషయం కాదు.పైగా భారీ హిట్ లతో కెరీర్ కి కొత్త ఉత్సాహం ఇచ్చిన బోయపాటి లాంటి దర్శకుడిని కాదనుకుని క్రిష్ వైపు బాలయ్య మొగ్గినప్పుడు బాలయ్య ఫాన్స్ కూడా హర్ట్ అయ్యారు.కానీ సినిమా ఫస్ట్ లుక్ ,టీజర్,థియేట్రికల్ ట్రైలర్ తో వాళ్లు పొంగిపోయారు.ఇదంతా బాలయ్య,క్రిష్ తీసుకున్న రిస్క్ వల్లే సాధ్యమైంది.ఇప్పుడు రెండు సినిమాలు సంక్రాంతి బరిలో పోటీపడుతున్నాయి.దీంతో మళ్లీ పోలికలు మొదలయ్యాయి.అంతిమ ఫలితమేదైనా ప్రస్తుతానికి ట్రైలర్ రెస్పాన్స్ తో నందమూరి ఫాన్స్ ఖుషీగా ఉంటే ..ఖైదీ నెంబర్ 150 గురించి మెగా ఫాన్స్ కొద్దిగా టెన్షన్ పడుతున్నారు.ఏదేమైనా సేఫ్ చూసుకుని దెబ్బ తిన్నామా అని మెగా ఫ్యామిలీ అంతర్మధనం చెందటం ప్రస్తుతానికి నిజం.

SHARE