మెగా క్యాంపు వెనుకడుగు..

  mega family want coming top postion
టాలీవుడ్ లో 15 ఏళ్ల తరువాత టాప్ త్రీ మూవీస్ లిస్ట్ లోమెగా క్యాంపు సినిమా లేకపోవడం ఇప్పుడే.2001 లో కొన్ని నెలలపాటు మాత్రమే నరసింహనాయుడు,సమరసింహారెడ్డి టాప్ 2 మూవీస్ గా నిలిచాయి.మరో సినిమా టాప్ త్రీ స్థానం లో వుంది.కొద్ది రోజులకే ఖుషీ తో పవన్ కళ్యాణ్ ,2002 లో ఇంద్ర తో చిరు టాప్ లోకి వచ్చారు.ఈ 15 సంవత్సరాల్లో మెగా కుటుంబ హీరోలు ఎవరో ఒకరు భారీ హిట్స్ ఇస్తూనేవున్నారు.

మళ్ళీ ఇన్నాళ్టికి ఆ పరిస్థితి తలెత్తింది.బాహుబలి టాప్ చైర్ లో ఠీవీగా కూర్చుంటే ..శ్రీమంతుడు ద్వితీయ స్థానంలో..జనతా గ్యారేజ్ థర్డ్ ప్లేస్ లో నిలిచాయి. ఈ పరిస్థితి మార్చడానికి మెగా క్యాంపు హీరోలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.ధ్రువ తో రామ్ చరణ్ ,దువ్వాడ జగన్నాధం తో బన్నీ ,ఖైదీ నెంబర్ 150 తో చిరు,కాటమరాయుడు తో పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నారు.వీటిలో ఏదో ఓ సినిమా టాప్ త్రీ లీగ్ లోకి వస్తామని మెగా అభిమానులు ఆశపడుతున్నారు.

SHARE