Posted [relativedate]
దీపావళికి సరిగ్గా ఒక్కరోజు ముందు మెగా అభిమానులు సమావేశం కానున్నారు. శనివారం (అక్టోబర్ 29 ) ఉదయం 10:35 గం. లకు మెగా కాంపౌండ్ చిరంజీవి బ్లడ్ బ్యాంకులో విస్తృత స్థాయి మీటింగ్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఉన్నట్టుండి..ఈ మీటింగ్ ఏర్పాటుకి కారాణాలు ఏమిటీ.. ?అని సినీ,రాజకీయ వర్గాలు ఆరా తీస్తున్నాయి.
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ‘ధృవ’ ప్రమోషన్ కోసమే ఈ మెగా మీటింగ్ జరగబోతున్నట్టు సమాచారమ్.చెర్రీకి అర్జెంటుగా ఓ హిట్ అవసరం.అది మరింత గ్రాండ్ గా ఇవ్వాలని మెగా ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారు.ధృవ డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.దీంతో..ఈలోపు సినిమాను భారీ స్థాయిలో జనాల్లోకి తీసుకెళ్లాలని అభిమానులు ప్లాన్ చేస్తున్నారు.ఇందుకోసం కొత్త రకంగా ఎలా చేయాలి, ఆడియో వేడుకను ఏవిధంగా నిర్వహించాలి అనే విషయాలని మీటింగ్ లో చర్చించనున్నారు. మెగా అభిమానులు మీరు కూడా వెళ్లండీ…!