మిస్టర్‌కు ఫిదా కలిసి వచ్చేనా?

0
451
mega hero varun tej act in fidaa movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ వరుసగా చిత్రాలు చేస్తున్న కమర్షియల్‌ సక్సెస్‌లు మాత్రం దక్కించుకోవడంలో విఫలం అవుతున్నాడు. ఇటీవలే ‘మిస్టర్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మెగా హీరో డిజాస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. శ్రీనువైట్లను నమ్ముకున్నందుకు వరుణ్‌ తేజ్‌ నట్టేట మునిగాడు. ఆ సినిమా కెరీర్‌లోనే ఒక చెత్త సినిమాగా నిలిచిపోయింది. అయినా కూడా నిరుత్సాహ పడుకుండా ఈ మెగా మిస్టర్‌ ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘ఫిదా’ చేస్తున్నాడు.

ఇప్పటి వరకు ఒక జోన్‌లో సినిమాలు తెరకెక్కించిన శేఖర్‌ కమ్ముల తన గత చిత్రాలకు పూర్తి విభిన్నంగా ‘ఫిదా’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఫిదా చిత్రంకు సంబంధించిన చివరి దశ షూటింగ్‌ జరుగుతుంది. ఈ చిత్రంలో వరుణ్‌ అమెరికా అబ్బాయిగా కనిపించబోతున్నాడు. హీరోయిన్‌ ఇండియా అమ్మాయిగా కనిపించనుందట. వీరిద్దరి మద్య ప్రేమ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇటీవలే ఫస్ట్‌లుక్‌ విడుదలైన ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తానంటూ నిర్మాత దిల్‌రాజు ప్రకటించాడు. ఇదైనా వరుణ్‌ తేజ్‌కు సక్సెస్‌ను ఇస్తుందా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇది కూడా ఫ్లాప్‌ అయితే మెగా హీరోకు మరింత కష్టం తప్పదు.

Leave a Reply