Posted [relativedate]
తమిళనాడు ప్రజల జల్లికట్టు ఉధ్యమం.. ఏపీ ప్రజల్లో ప్రత్యేక హోదా కాంక్షను రేకెత్తించింది. తమ సంప్రదాయ క్రీడపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని సముద్రతీరంలో తమిళ యువత సాగించిన పోరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కదిలించింది. ఆగమేఘాల మీద జల్లికట్టు ఆర్డినెన్స్ కు కేంద్ర సర్కారు పచ్చజెండా ఊపింది. ఈ జల్లికట్టు ఉద్యమం ఇచ్చిన స్పూర్తితో ఏపీ ప్రజలు.. ప్రత్యేక హోదా కోసం ఒక్కొక్కరు కదులుతున్నారు.
ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ ఎంపీ కేవీపీలు జల్లికట్టు ఉద్యమ స్పూర్తితో ప్రత్యేకహోదా ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించగా, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా హోదాకోసం ఎవరు వచ్చినా పోరాడేందుకు సిద్ధమేనని సముఖత వ్యక్తం చేస్తోంది. మన రాష్ట్రం- మన హోదా’ అంటూ ఈ నెల 26న విశాఖ బీచ్లో మహోద్యమానికి ఆంధ్ర యువత శ్రీకారం చుట్టబోతోంది.
కాగా ఈ ఉద్యమానికి వరుణ్ తేజ్, సాయి ధరమ్ కూడా తమ మద్దతును తెలిపారు. హీరో సాయి ధరమ్ తేజ్ తన ఫేస్బుక్ వాల్ మీద.. నా రాష్ట్రానికీ, ప్రజలకీ మంచి జరిగేది ఏదైనా దానికి మద్దతివ్వాల్సిందే… నేను ఏపీ ప్రత్యేక హోదా పోరాటానికి మద్దతు ఇస్తున్నా.. అంటూ పోస్ట్ చేసాడు. అలాగే తనీష్, సందీప్ కిషన్ కూడా ఈ పోరాటానికి మద్దతు తెలిపారు. ఏది ఏమైనా వరదలూ, భూకంపాలకు మాత్రమే కలిసి వచ్చే మన తెలుగు తారలు… జల్లి కట్టు ఉధ్యమంతో ఐనా ప్రత్యేకహోదాఫై కాస్త దృష్టి పెడుతుడడం అభినందించదగ్గ విషయమే.