Monday, September 27, 2021
HomeEntertainmentCinema Latestమెగా మల్టీస్టారర్‌ : టీఎస్పార్‌ పచ్చి అబద్దాలు

మెగా మల్టీస్టారర్‌ : టీఎస్పార్‌ పచ్చి అబద్దాలు

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మెగాఫ్యాన్స్‌ను ఊరిస్తున్న మెగా మల్టీస్టారర్‌ లేదని, అదే పచ్చి అబద్దం అని తేలిపోయింది. చాలా రోజుల క్రితం ఎంపీ, ప్రముఖ నిర్మాత టీ సుబ్బిరామిరెడ్డి మెగా బ్రదర్స్‌ చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌లతో భారీ మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేయబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. అశ్వినీదత్‌తో కలిసి త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఆ మల్టీస్టారర్‌ను తాను నిర్మిస్తున్నాను అంటూ పేర్కొనడంతో అందరిలో కూడా ఆసక్తి రేకెత్తింది. అయితే పవన్‌ కళ్యాణ్‌ మల్టీస్టారర్‌ గురించి తనను ఎవరు సంప్రదించలేదు అంటూ చెప్పుకొచ్చాడు.

పవన్‌ ఆ మాట అన్న తర్వాత మెగా మల్టీస్టారర్‌ లేదు అంటూ తేలిపోయింది. అయితే మళ్లీ కొన్ని రోజుల క్రితం టీఎస్పార్‌ మాట్లాడుతూ మెగా బ్రదర్స్‌ మల్టీస్టారర్‌ కథ పూర్తి అయ్యింది. వారిద్దరు కూడా కథకు మంచి మార్కులే వేశారు. త్వరలోనే సినిమాను ప్రారంభిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇద్దరు కూడా వారి వారి ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. వారు ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్‌లు పూర్తి అయిన వెంటనే మల్టీస్టారర్‌ను ప్రారంభిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో మరోసారి మెగా మల్టీస్టారర్‌పై ఆసక్తి నెలకొంది. త్రివిక్రమ్‌ ఈ విషయమై స్పందిస్తూ తాను మెగా మల్టీస్టారర్‌కు దర్శకత్వం వహించబోతున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని, తనను ఆ ప్రాజెక్ట్‌ విషయమై ఎవరు సంప్రదించలేదు అంటూ తేల్చి చెప్పాడు. దాంతో మెగా మల్టీస్టారర్‌ గురించి టీ సుబ్బిరామిరెడ్డి చేస్తున్న ప్రకటనలు పచ్చి అబద్దాలు అని, పబ్లిసిటీ కోసం ఆయన అలా చేస్తున్నాడంటూ తేలిపోయింది.

- Advertisment -
spot_img

Most Popular