మెగా మూవీలో ఐటం గాళ్ ఎవరో..!

0
184
mega movie item girl

mega movie item girl

మెగాస్టార్ 9 ఏళ్ల తర్వాత చేస్తున్న కత్తి రీమేక్ గా ఖైది నెంబర్ 150 సగం వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. రీసెంట్ గా ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో అభిమానులను అలరించిన చిరు దసరా కల్లా టీజర్ తో పలుకరించాలని చూస్తున్నాడు. స్టార్ సినిమా అంటే కమర్షియల్ అంశాలుండాల్సిందే అందుకే ఎలాంటి ఆడియెన్స్ కు లోటు రాకుండా సినిమాను అన్ని యాస్పెక్ట్స్ లో కవర్ చేసేలా చూస్తున్న వినాయక్.. ఇక అదే క్రమంలో ఫ్యాన్స్ కోసం కేక పెట్టించే ఐటం సాంగ్ ఒకటి ప్లాన్ చేస్తున్నారట. ఐటం సాంగ్ అనగానే మనముందు కదిలే భామలు చాలామందే మరి వారిలో ఒకరిని ఎంపిక చేస్తారా లేక కొత్త వారిని తీసుకుంటారా అన్నది కన్ ఫ్యూజన్ ఏర్పడింది.

ఇప్పటికే హీరోయిన్ విషయంలో లేట్ చేసి చివరకు కాజల్ తో కానిచ్చేస్తున్న చిత్రయూనిట్ ఇప్పుడు ఐటం సాంగ్ అంటే ఎంతమందిని వడకాస్తారో చూడాలి. అసలైతే మిల్కీ బ్యూటీ తమన్నా లేక హాట్ బ్యూటీ హంసా నందిని పేర్లు వినపడుతున్నాయి. మరి ఈ ఇద్దరిలో ఎవరైనా అవుతారా లేక ఇద్దరిని కాదని ముంబై మోడల్ ను దించుతారా అన్నది వేచి చూడాలి. సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఖైది నెంబర్ 150 మూవీ సంక్రాంతి బరిలో దించాలనే ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. చిరు నుండి అభిమానులు ఆశిస్తున్న అన్ని అంశాలు ఖైది నెంబర్ 150లో ఉన్నాయని వినాయక్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాడు.

Leave a Reply