ధ్రువ డైరక్టర్ కు మరో మెగా ఛాన్స్..!

0
351
Megastar Chance To Surendar Reddy

Posted [relativedate]

Megastar Chance To Surendar Reddy9 ఏళ్ల విరామం తర్వాత మెగాస్టార్ మెగా మూవీ చేస్తున్నాడు తమిళ కత్తి సినిమా రీమేక్ గా ఖైది నెంబర్ 150 సినిమా చేస్తున్న చిరు ఆ తర్వాత సినిమాల మీద కూడా దృష్టి పెట్టాడు. ప్రస్తుతం 150 చేస్తున్న చిరు త్వరలోనే 151వ సినిమా మీద ఓ ఫైనల్ డెశిషన్ తీసుకోనున్నాడు. ఇక చిరు తర్వాత సినిమా రేసులో ఇప్పటికే బోయపాటి శ్రీను ఓకే అని తెలుస్తున్నా ఇప్పుడు మరో దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా ఉన్నాడని అంటున్నారు. మెగా హీరోలతో సూపర్ హిట్ సినిమాలు తీసిన సురేందర్ రెడ్డి ఏకంగా మెగాస్టార్ నే డైరెక్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది.

ప్రస్తుతం రాం చరణ్ ధ్రువ మూవీని డైరెక్ట్ చేసిన సురేందర్ రెడ్డి మెగాస్టార్ ని ఇంప్రెస్ చేశాడట. సురేందర్ రెడ్డి వర్కింగ్ స్టైల్ నచ్చినా మెగాస్టార్ కథ కుదిరితే సినిమా చేసేద్దాం అన్నారట. చిరుతో సురేందర్ రెడ్డి సినిమా అంటే లక్కీ ఛాన్స్ పట్టేసినట్టే. అయితే ఇప్పటికే కన్నడ యువ హీరో నిఖిల్ గౌడ్ తర్వాత సినిమా కమిట్ అయిన సురేందర్ రెడ్డి ఆ తర్వాత చిరు సినిమా డైరెక్షన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ధ్రువ అనుకున్న రేంజ్ హిట్ అయితే కనుక మెగాస్టార్ ఆఫర్ కన్ఫాం అయినట్టే. ఇప్పటికే అల్లు అర్జున్ తో రేసుగుర్రం హిట్ ఇచ్చిన సురేందర్ రెడ్డి ధ్రువగా చరణ్ కు ఎలాంటి గిఫ్ట్ ఇస్తాడో చూడాలి.

Leave a Reply