బాహుబలిని దాటేసిన మెగాస్టార్….

 Posted October 19, 2016

megastar chiranjeevi break bahubali movie record

మెగాస్టార్ మోత మొదలైంది. ఫస్ట్ దెబ్బకి బాహుబలి రికార్డ్ ఒకటి బ్రేకయింది. వి.వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ చిత్రం ‘ఖైదీ నెం.150’. ఒకట్రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. దీంతో.. ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలైంది. తాజాగా, ‘ఖైధీ నెం150’ ఆంధ్ర రైట్స్ రూ. 32 కోట్లకు అమ్ముడు పోయినట్టు సమాచారమ్. ఈ లెక్కన ‘బాహుబలి’ని మెగాస్టార్ దాటేశాడు.

తెలుగు ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన ‘బాహుబలి’ ఆంధ్రా హక్కులు రూ. 30 కోట్ల ధర పలికాయి. ఇప్పుడు బాహుబలి ని క్రాస్ చేసింది మెగా ఖైదీ. దాదాపు
9 యేళ్ల తరువాత మెగాస్టార్ రీ-ఎంట్రీ ఇస్తుండటంతో మెగా ఖైదీపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. దీనికి తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయే రేంజ్ లో జరుగుతోంది. రిలీజ్ కి ముందే బాహుబలి రికార్డ్ కి గండికొట్టింది మెగా ఖైదీ. ఇక, రిలీజ్ తర్వాత ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో..? చూడాలి.

SHARE