మెగాస్టార్ డైరక్షన్ కూడానా..!

Posted December 13, 2016

Megastar Chiranjeevi Direction For Khaidi No 150మెగాస్టార్ చిరంజీవి ఇప్పటిదాకా హీరోగానే తెలుసు కాని ఎంతమందికి చిరు డైరక్షన్ టాలెంట్ గురించి తెలుసో చెప్పలేం. చిరంజీవి డైరక్షన్ ఏంటి సౌండింగ్ వినడానికే కొత్తగా ఉంది కదా అనుకోవచ్చు. నిజంగానే చిరు తను నటిస్తున్న ఖైది నెంబర్ 150 సినిమాలో ఓ షాట్ డైరెక్ట్ చేశాడట. మరి చిరు డైరెక్ట్ చేస్తుంటే అసలు డైరక్టర్ వినాయక్ ఏం చేస్తున్నాడు అంటే ఆ షాట్ లో నటిస్తున్నది వినాయక్ అని తెలుస్తుంది.

మెగాస్టార్ స్టార్ట్ కెమెరా యాక్షన్ అంటే ఇక ఏమైనా ఉందా చెప్పండి.. ఖైది సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న సందర్భంగా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోలో లాస్ట్ షాట్ లో చిరు యాక్షన్ అని చెప్పడం గమనిస్తే ఆ సీన్ లో వినాయక్ ఏదో నటిస్తున్నట్టు కనిపిస్తాడు. సో అలా మొత్తానికి చిరు డైరక్షన్ కూడా చేశాడన్నమాట. ఇక నేటితో ఖైది సినిమా షూటింగ్ పూర్తయినట్టు అధికారికంగా వెళ్లడించారు.

ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసి అనుకున్న సంక్రాంతి సీజన్లో సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. తమిళ సూపర్ హిట్ సినిమా కత్తి రీమేక్ గా వస్తున్న ఈ మూవీని మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిర్మిస్తున్నారు.

SHARE