మెగాస్టార్ వార్నింగ్ ఇచ్చేశాడోచ్..!

Posted December 8, 2016

Megastar Chiranjeevi Khaidi No 150 Teaser Releasedమెగాస్టార్ 9 ఏళ్ల తర్వాత చేస్తున్న సినిమా ఖైది నెంబర్ 150 తమిళ కత్తి సినిమా రీమేక్ గా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి సినిమా మీద అంచనాలను పెంచేసింది. ఇక కొద్ది నిమిషాల క్రితం సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా.. నచ్చితేనే చూస్తా.. కాదని బలవంతం చేస్తే కోస్తా అంటూ.. స్వీట్ వారింగ్ ఇచ్చాడు మెగాస్టార్. అదే లుక్కు అదే టెక్కు అచ్చం మెగాస్టార్ ఓ రేంజ్ ఫాంలో ఉన్న విధంగానే అదరగొట్టాడు చిరంజీవి.

ఇక సినిమాలో తన మార్క్ స్టైలిష్ యాక్షన్ తో పాటుగా మెగా మెరుపులు ఉంటాయని చెప్పకనే చెప్పేశాడు.. స్వీట్ వార్నింగ్ అంటూ సర్ ప్రైజ్ షాక్ ఇచ్చిన మెగాస్టార్ సినిమా అంచనాలను అమాంతం పెంచేశాడు. 9 ఏళ్ల తర్వాత సినిమా కదా అని సైలెంట్ గా ఉంటాడనుకున్నారేమో అదే జోష్ అదే జోరులా కనిపిస్తుస్తుంది ఇక ఈ ఖైది ఉత్సాహం ఇలానే కొనసాగి సినిమా కూడా భారీ రేంజ్ లో సక్సెస్ అయ్యేలానే ఉంది.

ఇక టీజర్ తో ఈరోజు సాయంత్రం నుండే మెగా అభిమానిల పండుగ సందడి మొదలైంది. నేడు చిరు టీజర్ రేపు రాం చరణ్ సినిమాతో ఒకేసారి రెండు పండుగలను ఫ్యాన్స్ కు గిఫ్ట్ గా అందించారు.

SHARE