మెగా స్టార్ తో బోయపాటి ఫిక్స్?

Posted September 22, 2016

 megastar chiru 151 movie director boyapati
మెగా స్టార్ చిరు 151 వ సినిమాకి రంగం సిద్ధమవుతోంది.బావమరిది అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ పతాకంపై సినిమాకి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే దర్శకుడి విషయాన్ని అరవింద్ కే వదిలేసారట.దీంతో అరవింద్ చాలా కసరత్తు చేశారు.చివరికి బోయపాటికి ఓటేసినట్టు తెలుస్తోంది.మాస్ సినిమాలు తీయడంలో గట్టిపట్టున్న బోయపాటి అయితే చిరు రాజకీయ ప్రయాణానికి కూడా ఉపయోగపడతాడని అరవింద్ ప్లాన్ అంట.ఇక చిరుకి సైతం బోయపాటి చెప్పిన కథ నచ్చిందట.

సరైనోడు సినిమా టాక్ మిక్సెడ్ గా వచ్చినా దాని కలెక్షన్స్ చూసిన అరవింద్ ..బోయపాటితో మరో మూవీ చేయాలని అప్పుడే ఫిక్స్ అయ్యారు.ఇప్పుడు చిరు తోడవడంతో నిర్మాణ పరంగా,కలెక్షన్స్ పరంగా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేలా అరవింద్ ,బోయపాటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

SHARE