ఆ రికార్డ్ పై కన్నేసిన మెగాస్టార్..!

0
362

 Posted [relativedate]

mgr1
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైది నెంబర్ 150 సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి మెగా ఫ్యామిలీలోనే కాదు మెగా అభిమానుల్లో కూడా ఓ కొత్త ఉత్సాహం మొదలైంది. తమిళ కత్తి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక నిర్మాణరంగంలోకి మొదటిసారి అడుగుపెట్టిన చరణ్ సినిమా బిజినెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఏరియాల వారిగా అదరగొట్టే రేంజ్లో బిజినెస్ చేస్తున్న ఖైది మూవీ ఇప్పుడు మొదటిరోజు రికార్డుల మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది.

అందుకే మొన్నటిదాకా జనవరి 13న రిలీజ్ అంటూ చెప్పిన ఖైది నెంబర్ 150 సినిమా రిలీజ్ కాస్త ఓ రెండు రోజులు ముందుకు జరిపి జనవరి 11న రిలీజ్ అని చెప్పుకొస్తున్నారట. అయితే జనవరి 12న గౌతమిపుత్ర శాతకర్ణిగా బాలయ్య వచ్చేస్తున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆ సినిమా తర్వాత రోజు రిలీజ్ చేస్తే మొదటి రోజు కలక్షన్స్ గండి పడే అవకాశం ఉంది అని ఆలోచించిన ఖైది టీం సినిమాను జనవరి 11నే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. సోలోగా చిరు సినిమా చూసి దాదాపు 9 ఏళ్లు కావొస్తుంది. ఫ్యాన్స్ అంతా మొదటి రోజు మొదటి ఆటకే మెగాస్టార్ సినిమా చూసేయాలని ఆరాటపడతారు. మరి మెగా బిజినెస్ ప్లాన్ గా వస్తున్న ఈ మెగా మూవీ మేనియా ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి.

Leave a Reply