మెగా ‘మిస్టర్’ కి అక్కడ కూడా అభిమానులా.?

0
439

varun1megastar radio

మెగా ఫ్యామిలీలోని హీరోలందరూ అవకాశం వచ్చిందంటే.. ‘మెగాస్టార్ చిరంజీవి’ గురించే చెప్తూ ఆయనపై తమకున్న అభిమానం చాటుకుంటారు. పవన్ నుండి వరుణ్ తేజ్ వరకు.. అందరిదీ ఇదే తీరు. చిరు తమ కుటుంబసభ్యుడే అయినా వీరంతా ఆయనకు వీరాభిమానులు. ప్రస్తుతం ‘మిస్టర్’ షూటింగ్ నిమిత్తం స్పెయిన్ లో ఉన్న వరుణ్ పెదనాన్నపై తనకున్న ప్రేమాభిమానాలు మరోసారి చాటుకున్నాడు.

వరుణ్ తాను బస చేస్తున్న హోటల్ నుండి షూటింగ్ స్పాట్‌కు వెళ్ళడానికి ఒక కారు వాడుతున్నాడు. ఆ కారులో ఎఫ్.ఎం. రేడియో వింటుంటాడు. ఈ ‘కంచె’ హీరో వినే రేడియో ఛానల్ పేరు ”మెగాస్టార్ FM”. స్పెయిన్లో ఈ రేడియో బాగా పాపులర్. ఆ ఎఫ్‌ఎం పాపులర్ కాకపోయినా మెగాస్టార్ పేరును పెట్టుకున్నందుకు ఆ ఛానలే వింటాను అంటున్నాడు వరుణ్ తేజ్. మెగాస్టార్‌పై తమకున్న అభిమానం అలాంటిదంటూ సోషల్‌మీడియాలో చెప్పకొచ్చాడీ యువహీరో.

Leave a Reply