మెగాస్టార్ సినిమాకు లీకేజ్ బెడద..!

0
354
Megastar Movie Song Bit Leaked Online

Posted [relativedate]

Megastar Movie Song Bit Leaked Online9 ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా ఖైది నెంబర్ 150. వినాయక్ డైరక్షన్లో వస్తున్న ఈ సినిమాను స్వయంగా రాం చరణ్ నిర్మించడం విశేషం. అయితే ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల లీకేజ్ ప్రాబ్లెం పెద్ద తలనొప్పిగా మారింది. సినిమాకు పనిచేసే టెక్నికల్ టీమే ఈ లీకేజ్ కు పాల్పడటంతో ఏ చేయాలో దిక్కుతోచని పరిస్థితి అయ్యింది. రీసెంట్ గా బాహుబలి, ఓం నమో వెంకటేశాయా సినిమాలు లీక్ బాట పట్టిన సంగతి తెలిసిందే.

ఇక ఆ క్రమంలో మెగాస్టార్ చిరు నటిస్తున్న ఖైది సినిమాలోని ఐటం సాంగ్ బిట్ కూడా యూట్యూబ్ లో దర్శనమిచ్చిందట. సడెన్ గా ఈ విషయం తెలుసుకున్న చిత్రయూనిట్ షాక్ అవ్వడమే కాకుండా ఆ వీడియోని వెంటనే డిలీట్ చేయించడం జరిగింది. అయితే వీడియో క్వాలిటీ కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఎక్కువగా డ్యామేజ్ ఏమి జరుగలేదు. సో మొత్తానికి లీకేజ్ బెడద నుండి ఖైది కూడా తప్పించుకోలేకపోయాడన్నమాట.

ఈమధ్య మరి ఎక్కువవుతున్న ఈ సమస్య నుండి ఎలా బయట పడాలా అన్న ఆలోచనతో చర్చలు జరుపుతున్నారు దర్శక నిర్మాతలు. త్వరలోనే దీనికి సంబందించిన సీరియస్ డెశిషన్ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. అప్పటిదాకా కాస్త ఓపిక పట్టాల్సిందే.

Leave a Reply