బాహుబలి రూట్ లో మెగా ప్లాన్..!

Posted December 22, 2016

Megastar Repeat Bahubali Pramotion Methods For His Khaidi No 150తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ సినిమాకు చాటి చెప్పిన బాహుబలి సినిమా రేంజ్ అందుకోవడం ఏ సినిమా కైనా కష్టమే.. కాని ఆ సినిమా చూపిన ప్రమోషన్స్ బాట మాత్రం అందరు ఫాలో అవుతున్నారు. కేవలం కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న మాటనే ప్రమోషన్ గా వాడుకునేలా చేసిన రాజమౌళి ప్లాన్ పార్ట్ 2 గురించి కూడా ఎక్సయిటింగ్ గా వెయిట్ చేయిస్తున్నాడు. అయితే ఇప్పుడు బాహుబలి రూట్ లోనే మెగాస్టార్ ఖైది నెంబర్ 150 కూడా వెళ్తుంది.

మెగాస్టార్ 9 ఏళ్ల తర్వాత చేస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఆ అంచనాలను అందుకునేలా సినిమాలో ఏదో ఒక యాస్పెక్ట్ తో ఆడియెన్స్ దగ్గరకు వెళ్తున్నారు చిత్రయూనిట్. అంతేనా సినిమా షూటింగ్ టైంలో సినిమాకు పనిచేసినా అందరితో ఆ సినిమా చేసిన అనుభూతిని తెలుసుకుని ఓ బుక్ ప్రింట్ చేస్తున్నారట. ఖైది సినిమాలో పనిచేసిన అందరు ఇచ్చిన ఆన్సర్స్ తో ఓ బుక్ ప్రింట్ అవుతుందట. ఇక ఆ బుక్ ను మెగాస్టార్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. సో ఈ విధంగా బాహుబలి బుక్ సెంటిమెంట్ ను మెగాస్టార్ తన ఖైది సినిమాకు వాడేస్తున్నాడన్నమాట.

SHARE