టీజర్ తోనే మెగా రికార్డులు మొదలయ్యాయిగా..!

0
343
Megastar Teaser Record In Youtube Tollywood Records

Posted [relativedate]

Megastar Teaser Record In Youtube Tollywood Recordsమెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ సినిమా ఖైది నెంబర్ 150 ఓ పక్క శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సినిమా పోస్టర్ తోనే బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఓ సంచలనం సృష్టించిన చిరు నిన్న రిలీజ్ అయిన టీజర్ తో రికార్డుల పని పట్టడం మొదలుపెట్టాడు. ఖైది నెంబర్ 150 సినిమా టీజర్ నిన్న సాయంత్రం 6 గంటలు రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన మూడుగంటల 5 నిమిషాల్లోనే 10 లక్షల వ్యూస్ తో ఓ ప్రభంజనం సృష్టించాడు మెగాస్టార్.

కత్తి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. 9 ఏళ్ల తర్వాత చిరు చేస్తున్న సినిమాగా ఖైది రికార్డులు సృష్టించడం ఖాయమని తెలిసిపోతుంది. మెగా లుక్ తో స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఖైది తో తన సత్తా ఏంటో చూపించాలని అనుకుంటున్నాడు. లుక్.. స్టైల్.. వీటన్నిటిలోనూ సర్ ప్రైజ్ చేస్తూ మెగాస్టార్ చేస్తున్న ఖైది నెంబర్ 150 సంక్రాంతి బరిలో దిగుతుంది. మరి దశాబ్ధ కాలంగా చిరు సినిమా కోసం చూసిన ఫ్యాన్స్ కు ఈ సినిమా ఎలాంటి అనుభూతిని కలిగిస్తుందో చూడాలి.

వినాయక్ డైరక్షన్లో వస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు .. కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Leave a Reply