మెగాస్టార్ వర్సెస్ సూపర్ స్టార్

0
300
megastar vs superstar

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

megastar vs superstarమెగాస్టార్‌ చిరంజీవి, సినిమాల్ని పక్కన పెట్టి రాజకీయాల్లోకొచ్చాకే ఆయనకు అసలు ప్రపంచం ఏంటో అర్థమయ్యింది. మెగాస్టార్‌గా చిరంజీవి సినీ రంగంలో ఓ వెలుగు వెలిగినన్నాళ్ళూ, ఆయన్ని మీడియా ఎప్పుడూ ప్రశ్నించలేదు.. వివాదాల్లోకి లాగలేదు. చిరంజీవి ఫొటో కోసం మీడియా పరితపించేది. చిరంజీవి సినీ రంగంలో సాధించిన విజయాల గురించి కొనియాడేది. కానీ, రాజకీయాల్లోకొచ్చాక సీన్‌ మారిపోయింది. చిరంజీవి అడుగేస్తే, అందులో తప్పుని వెతికింది మీడియా.

రాజకీయానికీ, సినీ రంగానికీ తేడా అదే. సినీ రంగంలో మెగాస్టార్‌ అయిన చిరంజీవికి ఎప్పుడూ ‘కులం’ అడ్డంకి కాలేదు. కానీ, రాజకీయాల్లోకి వస్తున్నారనగానే మొదటగా అడ్డంకి అయ్యింది ఆ ‘కులం’ మాత్రమే. ఇప్పుడు రజనీకాంత్‌ పరిస్థితి అంతే. చిన్న తేడా ఏంటంటే, రజనీకాంత్‌కి ‘ప్రాంతం’ తేడా వచ్చింది. రజనీకాంత్‌ కన్నడ మూలాలున్న వ్యక్తి. ఆయన జన్మించిందే కర్నాటకలో. అఫ్‌కోర్స్‌ చిరంజీవికీ తెలంగాణ సెగ తగిలిందనుకోండి.. అది వేరే విషయం.

తమిళ సూపర్‌ స్టార్‌గా రజనీకాంత్‌ని మీడియా ఇప్పటిదాకా గట్టిగా ప్రశ్నించింది లేదు. కానీ, ఇప్పుడాయనకు ప్రశ్నలు వెంటాడుతోంటే చిరాకు వస్తోంది. మీ పని మీరు చేస్తున్నారు కదా, నా పని నన్ను చేయనివ్వండి..’ అంటూ తాజాగా కసురుకున్నారాయన. రజనీకాంత్‌ రాజకీయ పార్టీ పెడుతున్నారని, ఆయన సోదరుడు స్వయానా వెల్లడించాక మీడియా ప్రశ్నించకుండా ఎలా వుంటుంది.?

రాజకీయ పార్టీ సంగతేంటి.? అన్న ప్రశ్నే కాదు.. తమిళనాడులో మిమ్మల్ని కన్నడిగుడిగా చూస్తున్నారు కదా.? అన్న ప్రశ్న కూడా ఎదురవుతుంది. అన్నిటికీ సమాధానం చెప్పి తీరాల్సిందే. మీడియా మీద కస్సుమంటే రాజకీయాల్లో నష్టపోయేది రజనీకాంతే. మీడియాతో ఎంత ఫ్రెండ్లీగా వుంటే, ఇప్పుడున్న రాజకీయాల్లో అంత మంచిది మరి. అన్నిటికీ మించి, రాజకీయాల్లో సహనం ముఖ్యం. చిరంజీవిలో ఆ సహనం లోపించింది. ఓపిక పట్టలేక చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీని మూసేసుకున్నారు. రేప్పొద్దున్న రజనీకాంత్‌ పరిస్థితీ ఇంతే అవుతుందేమో.

Leave a Reply