Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చైనాలో ఉన్న విషయం తెల్సిందే. చిరంజీవి మాత్రమే కాకుండా చిరంజీవి జనరేషన్‌కు చెందిన హీరోలు, హీరోయిన్స్ ఇంకా పలువురు కూడా చైనాలో చెక్కర్లు కొడుతున్నారు. తమ స్టార్ స్టేటస్‌ను వదిలేసి చైనాలో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. చైనాలో ఎక్కడ తిరిగినా కూడా ఇబ్బంది ఉండదు. అదే ఇండియాలో ఏ రాష్ట్రంలో తిరిగినా లేదా అమెరికాలో రోడ్లపై కనిపించినా కూడా ఇబ్బంది తప్పదు. ఎవరో తెలిసిన వారు, ఫ్యాన్స్ అంటూ దగ్గరకు వస్తారు. కాని చైనాలో మాత్రం ఆ ఇబ్బంది లేకుండా తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
రైల్వే స్టేషన్లో, రోడ్ల మీద బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా 1980 హీరోలు, హీరోయిన్స్ తిరుగుతూ టైంను స్పెండ్ చేస్తున్నారు. ఈ బ్యాచ్ ప్రతి సంవత్సరం కలుసుకుంటూ ఉంటున్నారు. తాజాగా ఈసారి చైనాలో గెట్టు గెదర్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చిరంజీవితో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్ కూడా పాల్గొనబోతున్నారు. బాలయ్య కూడా త్వరలోనే చైనాకు వెళ్లే అవకాశాలున్నాయి. సినిమాలు, ఇతరత్ర విషయాలు అన్ని కూడా పక్కకు పెట్టి వారం రోజుల పాటు చైనాలోనే వీరంత గడపబోతున్నారు. రాధిక, సుహాసిన, చిరంజీవి, మోహన్‌లాల్, రజినీకాంత్ వంటి వారు దీనిని ముందుండి నడిపిస్తున్నారు.
