భార్యని చూస్తే ట్రంప్ కి భయమా?

0
346

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Melania slaps away President Trump hand in Israelఅమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచానికి మకుటం లేని మహారాజు అని భావిస్తారు. ఇక ట్రంప్ విషయం అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ట్రంప్ విధానాలు, నిర్ణయాలతో ప్రపంచం ఆయన్ని చూసి భయపడుతోంది.కానీ ఒకరు మాత్రం ఆయన్ని ఏ మాత్రం లెక్క చేయడం లేదు. ఇంతకీ ఆ ఒక్కరు ఎవరో మీకు ఈపాటికే అర్ధం అయిపోయివుంటుంది.ఆమె ట్రంప్ సతీమణి మొలానియా. ప్రస్తుతం విదేశీ పర్యటనలో వున్న ట్రంప్ కాస్త హుందాగా తన భార్య చేయి అందుకుని నడవడానికి చేస్తున్న ప్రయత్నాలేమీ ఫలించడం లేదు.లోపల ఆ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందని మాత్రం మొలానియా ప్రవర్తన చెప్పకనే చెబుతోంది.ట్రంప్ ఆమె చేయి అందుకోవాలని ప్రయత్నించడం,ఆమె తప్పుకోవడం రెండో సారి కూడా ప్రపంచం కళ్ళ ని దాటిపోలేదు.

రియాద్ లో తొలిసారి ట్రంప్ అందించిన చేయి మొలనియా దాదాపు విదిలించినంత పని చేసింది. అయితే అదేదో రెడ్ కార్పెట్ ఇరుకుగా ఉండటంతో కలిసి నడవలేక మొలానియా అలా చేసిందని ట్రంప్ మద్దతుదారులు సమర్ధించుకున్నారు.ఇంకో రోజు గడవగానే అందులో నిజం లేదని తేలిపోయింది.ఈసారి రోమ్ లోను కాస్త అటుఇటుగా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. రోమ్ లో విమానం ల్యాండ్ అవ్వగానే ట్రంప్ దంపతులు బయటికి వచ్చారు.భార్య చేయి అందుకోడానికి ట్రంప్ ట్రై చేయగానే ఆమె జుట్టు సరిచేసుకోడానికి అన్నట్టు చేయి తీసేసుకుంది.దీంతో దాన్ని కవర్ చేసుకోడానికి ఆమె వెనుక భాగాన్ని స్పృశించి వదిలేశారు ట్రంప్.ఆ తర్వాత మొలానియా ప్రవర్తనలో ట్రంప్ పట్ల పెద్దగా సానుకూలత కనిపించలేదు.పైగా బాడీ లాంగ్వేజ్ చూస్తే ట్రంప్ ఆమెని చూసి వెనక్కి తగ్గుతున్నట్టు తేలిగ్గా అర్ధం అయిపోతోంది.

Leave a Reply