మొండి మొగుడు – పెంకి పెళ్లాం

0
370

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

విదేశీ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ – ఆయన భార్య మెలానీయా ట్రంప్ మధ్య ఓ ఇబ్బందికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇజ్రాయిల్ టూర్ వెళ్లిన ట్రంప్ దంపతులకు అక్కడ ఘన స్వాగతం లభించింది. ఆ దేశ ప్రధాని బెంజమెన్ నెతనాహ్యూ – ఆయన భార్య కలిసి ట్రంప్ జంటకు స్వాగతం పలికేందుకు ఎయిర్ పోర్ట్ వచ్చారు. అక్కడ రెడ్ కార్పెట్ పై ట్రంప్ – మెలానీయాలు విచిత్రంగా ప్రవర్తించిన పరిణామం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

విమానం దిగిన తర్వాత కలిసి నడుస్తున్న ట్రంప్ తన ఎడమ చేతితో మెలానీయా అర చేయిని పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ మెలానీయా మాత్రం ట్రంప్ చేయిని పక్కకు నెట్టివేసింది. మీడియా కెమెరాల ముందే మెలానీయా ఇలా ప్రవర్తించడం ఆశ్చర్యం వేసిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇద్దరి మధ్య బాడీ లాంగ్వేజ్ సరిగా లేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

పక్కపక్కనే నడుస్తున్న మెలానీయా ఎందుకు అలా చేసిందో అర్థం కావడం లేదని ఒకరు సందేహం వ్యక్తం చేయగా… రెడ్ కార్పెట్ పై ఇద్దరూ దూరం దూరంగా నడిచారని చూశారా అంటూ ఇంకొకరు విశ్లేషించారు. ఈ వార్తలపై అధ్యక్ష నివాసమై వైట్హౌజ్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. మొత్తం మీద ట్రంప్ కొంపలో ఏదో జరుగుతుందనే విషయం మాత్రం రూఢీ అయిపోయింది. ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్య అధ్యక్షుడు.. హోం మినిస్టర్ ని మాత్రం శాసించడం కాదు కదా.. కనీసం అర్థించలేని స్థితిలో ఉన్నాడని స్పష్టమైంది.

 

Leave a Reply