మెంతికూర – మునగ ఆకు ఉపయోగాలు…

0
962
methi drumstick leaf uses

Posted [relativedate]

methi drumstick leaf usesమెంతి కూర , మునగ ఆకు ఇవి తెలియని వారుండరు.వీటి వల్ల బోలెడు ఉపయోగాలున్నాయి తెలుసా అవేంటో చుడండి మీరే ..మునగ ఆకు కడుపులో పైత్యం, మంట, గ్యాస్, వేడిని తగ్గిస్తుంది. కడుపులోని నులిపురుగులను పోయేందుకు సహకరిస్తుంది. కఫ దోషాన్ని తగ్గిస్తుంది. కళ్లకు మేలు చేస్తుంది .అన్నిటికన్నా ముఖ్యం కొవ్వును కరిగించి, పొట్ట తగ్గించేందుకు స్థూలకాయం తగ్గేందుకు తోడ్పడతాయి. గుప్పెడు లేత మునగ చిగుళ్లను నీటిలో వేసి రసం పొడి కలిపి కమ్మని చారును కాసుకుని ప్రతి ఉదయం రాత్రి ఒక్కో గ్లాసు చొప్పున తాగండి లేదా అన్నంలో తినండి. చాలా కమ్మటి ఆహార పదార్థం మాత్రమే కాకుండా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. కీళ్లనొప్పులు, పక్షవాతం, స్థూలకాయం ఉన్నవారికి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.

మెంతి కూర స్త్రీలకు ఆప్తురాలు అని చెప్పాలి వారికి అవసరమైన ఔషధ గుణం ఉంది. ఆడవారిలో ఎక్కువగా కనిపించే బాధ నడుము నొప్పి మెంతికూర తినడం మంచి ఉపశమనం ఇస్తుంది. అంతేకాదు స్త్రీ పురుషులు లైంగిక సమర్థతను, లైంగిక ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది. మెంతికూరను రుబ్బి తలకు పట్టించి ఆరిన తర్వాత స్నానం చేయండి. మృదువైన కేశాలు లభిస్తాయి. రుతు సమయంలో రుతుస్రావం సక్రమంగా అయ్యేట్లు చేస్తుంది. శరీరానికి నీరు వచ్చినవారు మెంతికూరను రోజూ తింటే మంచి గుణం కనిపిస్తుంది. గర్భాశయం లోపల దోషాల వల్ల కలిగే ముట్టు నొప్పులను తేలికగా తగ్గిస్తుంది. ఇది తేలికగా అరిగే ఆహారం. దీనిని ఇతర ఆకు కూరలతో కలపకుండా విడిగా ఒక్క మెంతికూరను మాత్రమే కూరగానూ, పప్పుగానూ, పచ్చడిగానూ లేదా ఉడికించి మెత్తగా గుజ్జుగా చేసి అందులోచారు కాచుకొని తాగితే ఆరోగ్యం బావుంటుంది.

Leave a Reply