మెట్రో జీవితకాలం లేటేనా..?

0
503
metro lifetime late

 

Posted [relativedate]metro lifetime lateఅదిగో మెట్రో.. ఇదిగో మెట్రో అంటూ నాయకులు ఊరించడమే కానీ.. ఇంతవరకూ హైదరాబాద్ మెట్రో పనులు ఓ కొలిక్కి రాలేదు. కోర్టు కేసులు, నిధుల కొరత, గిట్టుబాటు కాదని ఎల్ అండ్ టీ సంస్థ సన్నాయి నొక్కులు మధ్య కొంత మార్గం వరకూ కంప్లీట్ అయింది. కానీ పూర్తైన మార్గంలో అయినా మెట్రో రైళ్లు తిరుగుతాయని భావించిన నగరవాసులకు నిరాశే ఎదురైంది. అన్ని మార్గాలు పూర్తయ్యాకే బళ్లు తిప్పుతామంటోంది హైదరాబాద్ మెట్రో కార్పొరేషన్. ఇదేం లెక్కో ఎవరికీ అంతుబట్టడం లేదు. కానీ అసలు విషయం వేరే ఉందని జీహెచ్ఎంసీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుత ధరలకు మెట్రో గిట్టుబాటు కావాలంటే.. టికెట్ ఛార్జీలు భారీగా ఉంటాయి. ఇప్పటికే హైదరాబాద్ లో ఇబ్బడిముబ్బడిగా ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. ఆ రేట్ల కంటే ఎక్కువుంటే జనం ఎక్కరన్న మాటలో వేరే వాదనకు తావులేదు. కానీ ఆ రేటు పెట్టినా.. మెట్రోకు నష్టం తప్పదనేది ఎల్ అండ్ టీ మాట. దీంతో మెట్రో ప్రారంభం ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. కనీసం ఆర్టీసీ ఛార్జీలతో సమానంగా మెట్రో టికెట్ పెట్టగలమన్న నమ్మకం కుదిరేవరకూ ప్రాజెక్టు అలా సాగుతూనే ఉండాలని నిర్మాణ సంస్థ భావిస్తున్నట్లు సమాచారం.

కానీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మాత్రం త్వరలోనే మెట్రో పట్టాలపైకి ఎక్కుతుందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. విదేశాలకు వెళ్లినా, ఢిల్లీ వెళ్లినా, ముంబై వెళ్లినా మెట్రోలో ప్రయాణించి ముచ్చట తీర్చుకుంటున్న కేటీఆర్.. భాగ్యనగర వాసుల ముచ్చట కూడా తీర్చాలని సెటైర్లు పడుతున్నాయి. ఇప్పటికే మెట్రో పనలు కారణంగా రహదారులపై ట్రాఫిక్ స్తంభిస్తోంది. వీలైనంత త్వరగా మెట్రో ప్రారంభమైతే హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలైనా తగ్గుతాయనేది సగటు నగరవాసి ఆలోచన. కానీ ప్రభుత్వం మదిలో ఏముందో ఆ పరమాత్ముడికే ఎరుక.

Leave a Reply