ఏపీలో పట్టాలెక్కుతున్న మెట్రో పనులు.

  metro work starts vijayawada apఅమరావతిలో మెట్రో ప్రాజెక్టుకు త్వరలో భూసేకరణ జరగనుంది. విశాఖ, విజయవాడ మెట్రోలకు పచ్చజెండా వూపి రెండేళ్లు కావస్తున్నా ప్రాజెక్టులు ముందుకు కదలడం లేదనే భావన ఉంది. రెండు ప్రాజెక్టులడీపీఆర్ లను ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ వేగంగానే పూర్తిచేసినా కేంద్ర అనుమతులు రావడంలో ఆలస్యమైంది. ఈ ఏడాది జనవరి నుంచే ప్రారంభించాల్సిన ప్రక్రియ ఇప్పటికీ మొదలుకాలేదు. ఈ రెండు ప్రాజెక్టులను వేగంగా పట్టాలెక్కించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇప్పటికే కేంద్ర ఆమోదం పొందిన విజయవాడ మెట్రోకు అవసరమైన భూసేకరణ పనులను వేగవంతం చేయనుంది. ఈ కీలకమైన ప్రక్రియ కోసం త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. తొలుత రూ.100 కోట్లతో ఈ పనులు ప్రారంభించనున్నారు. విజయవాడలో రూ.6,769 కోట్ల వ్యయంతో 26.03 కి.మీ.ల పొడవునా రెండు కారిడార్లను నిర్మించనున్న సంగతి తెలిసిందే. భూసేకరణ ఉత్తర్వులు జారీ కాగానే అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ (ఏఎంఆర్‌సీ) వెంటనే భూసేకరణ ప్రక్రియ ప్రారంభించనుంది. రెండు కారిడార్ల పరిధిలో సుమారు 75 ఎకరాల స్థలం మెట్రో ప్రాజెక్టుకు అవసరం. ఇందులో ప్రభుత్వ స్థలం కేవలం మూడున్నర ఎకరాలే ఉంది. దీంతో ఈ ప్రక్రియ కొంచెం క్లిష్టమైనదేనని అధికారులు భావిస్తున్నారు.

విశాఖపట్నం మెట్రో రైలును కేంద్రం భుజాన వేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. మూడు కారిడార్లకు రూ.13,488 కోట్లు ఖర్చవుతున్నందున భారీగా నిధులు సమకూర్చాల్సి ఉంటుంది. ఇందుకు జపనీస్ ఇంటర్నేషనల్ కార్పొరే షన్ ఏజెన్సీ (జైకా) నుంచి కూడా నిధులు రాబట్టుకోవడం కష్టమవుతున్నట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టు వేగంగా పట్టాలెక్కాలంటే పీపీపీ విధానమే ఉత్తమమని కేంద్రం స్వయంగా సూచించింది. ఇందుకు సలహాదార్లను నియమించుకునే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అంత ర్జాతీయ బిడ్లను సైతం ఆహ్వానించనున్నట్లు తెలిసింది. ఈ ప్రక్రియంతా ఐదారు నెలల్లో పూర్తికావచ్చని, భూసేకరణ ప్రక్రి యకు పెద్దగా ఇబ్బందులు తలెత్త కపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. మొత్త ం 42 కిలోమీటర్ల పరిధిలో నిర్మించే ఈ ప్రాజెక్టుకు 71.633 ఎకరాల స్థలం అవసరం. కేవలం 4.620 ఎకరాల ప్రైవేటు స్థలాన్ని సేకరిస్తే సరిపోతు ంది.

ప్రస్తుతం విశాఖ మెట్రో రైలు బాధ్యతలు ఏఎంఆర్‌సీనే చూస్తోంది. భవిష్య త్తులో కూడా విశాఖ మెట్రోకు వేరొక ప్రత్యేక ప్రయోజక వాహనం (స్పెషల్ పర్పస్ వెహికిల్) అవసరం లేకుం డా దీనినే కొనసాగించాలనే ఆలోచనలో ప్రభు త్వం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు ప్రాజెక్టులను కలిపి ఏపీ మెట్రోరైలు కార్పొరేషన్ (ఏపీఎంఆర్సీ)గా పేరు మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇందులో రాష్ట్ర అధి కారులతోపాటు ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ అధికారులను కూడా నియమి స్తారని తెలిసింది. మెట్రో రైలు ప్రాజెక్టులో అనుభవం ఉన్న డీఎంఆర్‌సీ సాయం తోనే ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తో ంది.
అమరావతి మెట్రోపై కదలిక..అమరావతి మెట్రో పనుల ప్రారంభంపై కదలిక మొదలైంది. నిడమనూరు నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ కారిడార్‌ను 2018 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. అయితే, మెట్రో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి కాబట్టి 2018 డిసెంబర్ లోగా ఆ కారిడార్‌ను పూర్తిచేయడం సాధ్యపడదని డీఎంఆర్సీ కొద్దిరోజులక్రితం స్పష్టం చేసింది. దీనికి భూసేకరణ జరపకపోవడమే ప్రధాన కారణమని పేర్కొంది.

అమరావతి మెట్రో ప్రారంభించేందుకు, కనీసం టెండర్లు పిలిచేం దుకైనా భూసేకరణ చేయాలి కాబట్టి ముందు ఆ పని పూర్తిచేయమని సూచిం చింది. ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ భూసేకరణకు తక్షణమే నిధులు ఇవ్వా లంటూ మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి కరికల్ వలవనకు లేఖ రాశారు. భూసేకరణ పరిహారాన్ని రూ.458.12 కోట్లుగా అంచనా వేశారు. భూసేకరణ నిర్వాసితులకు చట్టబద్ధంగా కల్పించే పునరావాస సౌకర్యాల బాధ్యతను రక్షణ ఏజెన్సీ అనే ఎన్జీవోకు అప్పగించారు. దీనికిగాను ఈ సంస్థకు రూ.3 లక్షలు చెల్లించాలని కలెక్టర్ నిర్ణయించారు. ఎలాగైనా 2018 డిసెంబర్ నాటికి నిడమానూరు – పండిట్ నెహ్రూ బస్టాండ్ కారిడార్‌ను పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

అమరావతి మెట్రో ప్రాజెక్టును ప్రకటించినప్పటి నుంచి తొలి కారిడార్‌ను 2018 డిసెంబర్‌కి పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రచారం చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రకటనకు కట్టుబడి ఉండాలని, ఆ సమయానికి కనీసం కొంతదూరమైనా మెట్రోబోగీలను తిప్పాలన్న ఉద్దేశం తో ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. అయితే, ఈ ప్రాజెక్టుకు ప్రధాన ఆర్థిక వనరుగా ఉన్న జైకా సంస్థకు, డీఎంఆర్సీకి మధ్య కన్సల్టెంట్ల నియామకం విష యం ఇంత వరకు పరిష్కారం కాలేదు

SHARE