ఎంపీ-ఎమ్మెల్యే మ‌ధ్య చిచ్చు పెట్టిన మంత్రి!!!

0
243
minister in between mp and mla

Posted [relativedate]

minister in between mp and mla
పాల‌మూరు టీఆర్ఎస్ లో ఆధిప‌త్య పోరు ఎక్కువైంది. నాయ‌కులు ఇప్పుడు ఒక‌రిపై ఒక‌రు డైరెక్టుగానే విమ‌ర్శ‌లు చేసుకునే దాకా వెళ్లింది. ముఖ్యంగా ఎంపీ జితేంద‌ర్ రెడ్డి- ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మ‌ధ్య ఉన్న విభేదాలు మ‌రోసారి బ‌ట్ట‌బ‌య‌ల‌య్యారు. ఇటీవ‌ల జ‌రిగిన టీఆర్ఎస్ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మంలో … ఇద్ద‌రి మ‌ధ్య కొంత డైలాగ్ వార్ కూడా న‌డిచింది.

స‌భ్య‌త్వ న‌మోదు సంద‌ర్భంగా ముందు ఎంపీ జితేంద‌ర్ రెడ్డి మాట్లాడారు. త‌న‌కు శ్రీనివాస్ గౌడ్ కు ఎలాంటి విభేదాలు లేవ‌ని చెప్పుకొచ్చారు. మీడియానే ఈ విభేదాల‌ను సృష్టిస్తోంద‌ని ఆరోపించారు. ఈలోపు శ్రీనివాస్ గౌడ్ వంతు వ‌చ్చింది. ఆయ‌న స్పంద‌న చూసి అంతా షాక‌వ్వాల్సి వ‌చ్చింది. త‌న‌కు మినిస్ట్రీ రాకుండా.. అడ్డుకుంది జితేంద‌ర్ రెడ్డేనంటూ.. ఒక మినిస్ట‌ర్ చెప్పార‌ని… శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ కు లేనిపోనివి చెప్పి మంత్రిప‌ద‌వి రాకుండా అడ్డుప‌డింది మీరేనంట‌… అని డైరెక్టుగా అడిగేశారు. దీనికి జితేంద‌ర్ రెడ్డి స్ట్రాంగ్ కౌంట‌రిచ్చారు. త‌నకు ఆ అవ‌స‌ర‌మే లేద‌ని స్ప‌ష్టం చేశారు. ద‌మ్ముంటే ఆ మినిస్ట‌ర్ ను తీసుకొస్తే… సీఎం ద‌గ్గ‌రే తేల్చుకుందామ‌ని స‌వాల్ విసిరారు.

ఇంత‌కు ఆ మినిస్ట‌ర్ ఎవ‌ర‌న్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇత‌ర జిల్లాల మంత్రుల విష‌యాన్ని ప‌క్క‌న‌బెడితే… అవిభాజ్య మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా మంత్రే ఈ చిచ్చు పెట్టార‌న్న వాద‌న వినిపిస్తోంది. అవిభాజ్య మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా నుంచి ఇద్ద‌రు మంత్రులు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. అందులో ఒకరు ల‌క్ష్మారెడ్డి కాగా… మ‌రొక‌రు జూప‌ల్లి కృష్ణారావు. జూప‌ల్లితో గౌడ్ కు సంబంధాలు అంతంత‌మాత్ర‌మే. కానీ ల‌క్ష్మారెడ్డితో శ్రీనివాస్ గౌడ్ కు మంచి రిలేష‌న్ ఉంది. దీంతో అలా చెప్పింది ల‌క్ష్మారెడ్డేన‌న్న వాద‌న వినిపిస్తోంది. ఎంపీ-ఎమ్మెల్యే మ‌ధ్య చిచ్చుపెట్టిన మంత్రి ఆయ‌నేన‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఎంపీ జితేంద‌ర్ రెడ్డితో ల‌క్ష్మారెడ్డికి కూడా విభేదాలున్నాయ‌ని చాలాకాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కాబ‌ట్టి కావాల‌ని ల‌క్ష్మారెడ్డే ఇదంతా చేయిస్తున్నార‌ని జితేంద‌ర్ రెడ్డి వ‌ర్గం భావ‌న‌. మ‌రి ఇందులో ఎంత వాస్త‌వ‌ముందో.. ల‌క్ష్మారెడ్డి క్లారిటీ ఇస్తే కానీ తెలియ‌దు!!!

Leave a Reply